Adah Sharma: ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. అప్పటివరకు సినిమాల నుంచి బ్రేక్‌: అదాశర్మ

|

Aug 05, 2023 | 5:47 PM

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేరళలో వెలుగు చూసిన లవ్‌ జిహాద్‌ నేపథ్యం ఆధారంగా ది కేరళ స్టోరీ తెరకెక్కింది. ఇందులో అదా అభియానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో అదా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

Adah Sharma: ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. అప్పటివరకు సినిమాల నుంచి బ్రేక్‌: అదాశర్మ
Adah Sharma
Follow us on

‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో నిజంగానే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది అదాశర్మ. ఈ సినిమా తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా, సెకెండ్‌ లీడ్ గా చేసింది. అయితే ఇన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క ‘ది కేరళ స్టోరీ’తో వచ్చింది. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేరళలో వెలుగు చూసిన లవ్‌ జిహాద్‌ నేపథ్యం ఆధారంగా ది కేరళ స్టోరీ తెరకెక్కింది. ఇందులో అదా అభియానికి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో అదా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం పలు హిందీ, తమిళ్‌ సినమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. ఇదిలా ఉంటే ఇటీవల తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది అదా. దీంతో ఆమెకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చింది ఆదా. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది.

‘నేను గత కొన్నిరోజులుగా చర్మ సంబంధిత సమస్యతో సతమతమవుతున్నారు. శరీరంపై దద్దుర్లు రావడంతో ఎక్కువగా ఫుల్ స్లీవ్స్‌ ఉన్న దుస్తులనే ధరించేదాన్ని. ఇక ఇటీవల తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా నా ఫేస్‌పై కూడా దద్దుర్లు వచ్చాయి. దీంతో మెడిసిన్స్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. అయితే దురదృష్టవశాత్తూ అవి అలర్జీకి దారి తీశాయి. ఇప్పుడు నేను వేరే మందులు తీసుకుంటున్నా. ఆరోగ్యం విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని అమ్మకు మాటిచ్చాను. మరికొన్ని రోజుల పాటు హెల్త్‌పై పూర్తి దృష్టి పెట్టాలనుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుస్తాను’ అని అదా తెలిపింది. కాగా ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం కమాండో 2. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆగస్టు 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.