టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మంగళవారం (జూన్ 25) తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా ఇద్దరూ తారస పడ్డారు. పరస్పరం క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆలయంలో థమన్ చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీలీలను అప్యాయంగా పలకరించిన తమన్ సరదాగా ఆమె బుగ్గ గిల్లారు. ఆ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరూ ఎవరి దారి వారు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు. శ్రీలీలతో ఉన్న చనువు, ఆప్యాయత కారణంగానే థమన్ అలా చేసినప్పటికీ శ్రీవారి ఆలయంలో ఇలాంటి చిలిపి పనులేంటంటూ మ్యూజిక్ డైరెక్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమన్ శ్రీవారి ఆలయం సాంప్రదాయాలు తెలుసని, అతను దర్శనానికి వచ్చిన విధానమే ఇందుకు ప్రత్యక్షనిదర్శనమంటున్నారు. దీనిని పెద్దగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు.
కాగా శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీత స్వరాలు అందించారు. ఇక గుంటూరు కారం తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శ్రీలీల మళ్లీ బిజీగా మారుతోంది. ఇప్పటికే ఆమె చేతిలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది.
திருப்பதியில் நடிகை ஸ்ரீலீலா..கூட்டத்தில் சிக்கிய நடிகை..பதறி போன பௌன்சர்ஸ்..!
#thirupathi #sreeleela #thanthitv pic.twitter.com/SoCnn3jCE8
— Thanthi TV (@ThanthiTV) June 25, 2024
Actress @sreeleela14 at Tirumala Today!#SreeLeela #Robinhood #UstaadBhagatSingh #RT75#FilmifyTelugu @TrendsSreeLeela @Sreeleela_Off pic.twitter.com/z0KjMOG3RR
— Filmify Official (@FilmifyTelugu) June 25, 2024
అలాగే మరోసారి నితిన్ సరసన నటించనుంది శ్రీలీల. రాబిన్ హుడ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రారంభం ఇటీవలే జరిగింది. మాస్ మహరాజ రవితేజతో కూడా మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.