Thalapathy Vijay: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దళపతి విజయ్ పోస్ట్..

|

Oct 04, 2024 | 2:17 PM

విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ అవుతోంది. భారీ అంచనాల మధ్య, విజయ్ నటించిన గోట్ థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు.

Thalapathy Vijay: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దళపతి విజయ్ పోస్ట్..
Vijay
Follow us on

దళపతి విజయ్ నటించిన గోట్ సినిమా సూపర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే.. తాజాగా విజయ్ తన వేలికి ‘గోట్’ ఉంగరం ధరించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ అవుతోంది. భారీ అంచనాల మధ్య, విజయ్ నటించిన గోట్ థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో విజయ్ తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ఒక్క తమిళనాడులోనే దాదాపు 1,100 థియేటర్లలో సోలోగా విడుదలైంది. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 5000 స్క్రీన్లలో విడుదలైంది.  ఇక ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

విజయ్ ఇకపై సినిమాల్లో నటించనని ప్రకటించడంతో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గోట్. విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్‌జీ అజ్మల్, అమీర్, మోహన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం AGS సంస్థ  25వ చిత్రం. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.

ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్

ఈ సినిమాలో విజయ్ రా ఏజెంట్ పాత్రలో నటించాడు. కొడుకు పాత్రలో నటించిన విజయ్ వయసును తగ్గించేందుకు డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. తండ్రి పాత్రకు గాంధీ అని, కొడుకు పాత్రకు జీవన్ అని పేరు పెట్టారు. అలాగే త్రిష, శివకార్తికేయన్‌లు అతిధి పాత్రల్లో నటించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా చూసిన అభిమానులకు దర్శకుడు వెంకట్ ప్రభు సర్ ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ధోని బ్యాటింగ్ చేస్తున్న దృశ్యం తెరపై కనిపించడంతో అభిమానుల ఈలలు గోలలతో థియేటర్ దద్దరిల్లింది. త్వరలోనే విజయ్ కొత్త సినిమా మొదలు కానుంది. తాజాగా విజయ్ చివరి సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ సంద‌ర్భంగా విజ‌య్ అభిమానుల‌నుఉత్సహం కలిగేలా  త‌న ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. గోట్ అనే ఉంగరాన్ని ధరించి విజయ్ మాస్‌గా ఫోజులిచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.