
టాలీవుడ్ లో మాస్ దర్శకుల లిస్ట్ లో ముందు వరసలో ఉంటారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. గోపిచంద్ మలినేని మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన డాన్ శీను సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టక ముందు అసిటెంట్ దర్శకుడిగా పలువురి దగ్గర పని చేశారు గోపిచంద్ మలినేని. ఇవివి సత్యనారాయణ, శ్రీను వైట్ల, మురుగ దాస్, శ్రీవాస్ , మెహర్ రమేష్‌లాంటి దర్శకుల దగ్గర అసిటెంట్ డైరెక్టర్ గా చేశారు గోపిచంద్ మలినేని. ఇక దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టి వరుస హిట్స్ అందుకున్నారు. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ యాక్షన్ దర్శకుడి.
డాన్ శీను, బాడీగార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్, వీరసింహారెడ్డి, జాట్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంటూ ప్రేక్షకులను మెప్పించారు గోపిచంద్. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆతర్వాత వచ్చిన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు గోపిచంద్. సన్నీడియోల్ తో కలిసి జాట్ అనే సినిమా చేశారు. ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్ మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో తనకు నో చెప్పాడని తెలిపారు. తెలుగు దర్శకుడిని కావడంతో నాకు ఆ హీరో నో చెప్పాడు అని తెలిపారు గోపీచంద్.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్. గోపిచంద్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత దళపతి విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నారట. ఈ మేరకు విజయ్‌ను కలిసి కథ కూడా చెప్పారట. విజయ్ కూడా సింగిల్ సిట్టింగ్ లోనే ఒకే చేశారట.. అయితే అప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఆ సమయంలో తెలుగు దర్శకుడితో సినిమా చేయడం అవసరమా అని ఎవరో విజయ్ కు చెప్పారట. అప్పటికే విజయ్ వంశీ పైడిపల్లితో వారసుడు సినిమా చేశారు. దాంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే సమయంలో మరో తెలుగు దర్శకుడితో చేయకూడదని విజయ్ భావించి నో చెప్పారట.. తెలుగువాడిని అని విజయ్ నాతో సినిమా చేయనన్నారు అని చెప్తూ గోపిచంద్ ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.