Thalapathy vijay: డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు.. కళ్ళలో నీళ్లు తిరిగాయి అంటూ ఎమోషనలైన టీమ్

|

Mar 25, 2025 | 7:24 AM

చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో దుమ్మురేపుతుంది డ్రాగన్ . లవ్ టుడే సినిమా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. లవ్ టుడే సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Thalapathy vijay: డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు.. కళ్ళలో నీళ్లు తిరిగాయి అంటూ ఎమోషనలైన టీమ్
Thalapathy Vijay
Follow us on

అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన డ్రాగన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ  చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించారు.  ఫిబ్రవరి 21, 2025న విడుదలైంది ఈ సినిమా. ఈ చిత్రాన్ని ఎ.జి.ఎస్. నిర్మించారు. డ్రాగన్ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి ఊహించని ఆదరణ పొందింది.  డ్రాగన్ సినిమా సామాన్యులతో పాటు సెలబ్రెటీల ప్రశంసలు కూడా అందుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సహా పలువురుప్రముఖులు డ్రాగన్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఇప్పటికే దళపతి విజయ్ డ్రాగన్ చిత్ర బృందానికి ఫోన్ చేసి ప్రశంసలు కురిపించారు. తాజాగా డ్రాగన్ టీమ్ ను విజయ్ కలిశారు.

దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోని కలవడం పై డ్రాగన్ టీమ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లను షేర్ చేశారు. మార్చి 24, 2025న, డ్రాగన్ టీమ్ దళపతి విజయ్‌ను కలిశారు. దీని పై దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ, “నేను దళపతి విజయ్‌ని కలవాలని, ఆయనతో కలిసి సినిమాల్లో పనిచేయాలని అనుకున్నానని అందరికీ తెలుసు. కానీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు రాలేదు, కానీ ఆయన ఎదురుగా కూర్చునే భాగ్యం నాకు లభించింది. నేను ఆయనను స్వయంగా చూశాను, ఆయనతో మాట్లాడినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ ప్రేమ వర్ణనాతీతం, అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు దళపతి విజయ్‌ను కలిసిన క్షణం గురించి తెలిపాడు.

అలాగే డ్రాగన్ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ దళపతి విజయ్ గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు..దళపతి విజయ్ గారు నాతో, “రండి, బ్రో” అన్నాడు. దళపతి విజయ్ ఈ మాట అన్నప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా.? నేను వివరించకుండానే మీ అందరికీ ఇది అర్థమవుతుంది. దళపతి విజయ్ ని స్వయంగా కలవడం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అని అన్నారు. “మాతో సమయం గడిపినందుకు చాలా ధన్యవాదాలు” అని విజయ్ గురించి ప్రదీప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

ప్రదీప్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..