
దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లియో. తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అక్టోబర్ 19న విడుదలైన లియో సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది లియో. ఖైదీ, విక్రమ్ సినిమాలతో లింక్ చేస్తూ లియో సినిమాను తెరకెక్కించాడు లోకేష్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అలాగే కలెక్షన్స్ కూడా భారీగా రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్ వస్తున్నాయి. విజయ్ కు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి మార్కెట్ క్రియేట్ చేశాయి.
ఇక లియో సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. లియో సినిమా వరల్డ్ వైడ్ గా తొలి రోజు 100 కోట్లకు పైగా వసూల్ చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది లియో. రెండో రోజు 11.68 కోట్ల వరకు వసూల్ చేసింది.
ఇక మూడో రోజు కూడా లియో మేనియా కొనసాగింది మూడో రోజు లియో సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. శనివారం కావడంతో లియో థియేటర్స్ ఫుల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు ఏకంగా రూ5 కోట్లకు పైగా వసూల్ చేసిందని ట్రేడ్ వర్గలు చెప్తున్నాయి. దసరా సెలవలు కావడంతో లియో మూవీ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మూడు రోజుల్లో లియో మూవీ వరల్డ్ వైడ్ గా 200 కోట్ల వరకు వసూల్ చేసింది. లియో సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్స్ గా నటించి మెప్పించారు.
#Leo Day 4 At Malaysia🇲🇾 @TGVCinemas endless vibe with #NaaReady 🧊💥💥💥💥#BlockbusterLeo@actorvijay @Dir_Lokesh @anirudhofficial @7screenstudio @Jagadishbliss @MrRathna @trishtrashers pic.twitter.com/cn6WGd3mH7
— LEO Movie (@LeoMovie2023) October 22, 2023
లేవు మూవీ ట్విట్టర్ పోస్ట్..
#Leo Full nd Full Family Audiance!#BlockbusterLeo ❤️🔥💥🧊@actorvijay @Dir_Lokesh @MrRathna @anirudhofficial @7screenstudio @Jagadishbliss pic.twitter.com/L3scF2MKzL
— LEO Movie (@LeoMovie2023) October 22, 2023
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..