Jana Nayakudu: దళపతి విజయ్ ‘జన నాయకుడు’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? అసలు నిజం ఇదే

దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్' (తెలుగులో జన నాయకుడు) అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ట్రైలర్ శనివారం (జనవరి 03) విడుదలైంది.

Jana Nayakudu: దళపతి విజయ్ జన నాయకుడు బాలయ్య భగవంత్ కేసరి రీమేకా? అసలు నిజం ఇదే
Jana Nayakudu Movie

Updated on: Jan 04, 2026 | 2:34 PM

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘ జన నాయగన్ ‘ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. దళపతి విజయ్ తో పాటు బాబీ డియోల్, మమిత బైజు, పూజా హెగ్డే, నరైన్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (జనవరి 03) ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  కాగా జన నాయగన్ సినిమా మొదటి నుంచి భగవంత్ కేసరి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. అలాగనీ సినిమా మొత్తం భగవంత్ కేసరి కాదని విజయ్ టీవీకే పార్టీ నేపథ్యాన్నిజనాల్లోకి తీసుకెళ్లేలా ఇందులో రాజకీయాలను కూడా చూపించారు.

జన నాయగన్ సినిమా ట్రైలర్ లో మమిత బైజు, పూజా హెగ్డే, విజయ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా వరకు భగవంత్ కేసరి సినిమాని పోలి ఉన్నాయి. విజయ్ చెప్పిన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాలయ్య సినిమాను గుర్తు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్..

అలాగనీ జననాయగన్ భగవంత్ కేసరికి పూర్తిగా రీమేక్ లా అనిపించడం లేదు. విజయ్ సినిమాలో చాలా రాజకీయ సన్నివేశాలు ఉన్నాయి. అలాగే, ట్రైలర్ చివరి సన్నివేశంలో విజయ్ రోబోతో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా చూస్తే, ఈ సినిమాలో 80 శాతం భగవంత్ కేసరి రీమేక్ అని, 20 శాతం హెచ్. వినోద్ బాలయ్య సినిమా కథకు రాజకీయ హంగులు జోడించినట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ రాజకీయ ఆలోచనలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కొన్ని సీన్లను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి విజయ్ చివరి సినిమాకు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

జన నాయకుడు ట్రైలర్..

భగవంత్ కేసరి ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.