Jana Nayagan Movie: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. ‘జన నాయగన్’ ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే

దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా 'జన నాయగన్'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలో గ్రాండ్‌గా నిర్వహించారు. దీంతో విజయ్ అభిమానులు ఈ ఈవెంట్ ను బాగా మిస్ అయ్యారు.

Jana Nayagan Movie: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. జన నాయగన్ ఆడియో లాంఛ్ మిస్ అయ్యారా? ఇది మీకోసమే
Thalapathy Vijay Jana Nayagan movie audio launch function

Updated on: Jan 01, 2026 | 8:15 AM

దళపతి విజయ్ ‘జన నాయగన్’ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. సాధారణంగా విజయ్ తన సినిమాలను ప్రమోట్ చేయడానికి ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడు. బదులుగా సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ ఈవెంట్స్ గట్టిగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు తన ఆఖరి సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఇటీవల ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మలేషియాలో భారీ స్థాయిలో నిర్వహించారు. అయితే విదేశాల్లో జరిగిన ఈ ఈవెంట్ ను చాలా మంది మిస్ అయ్యారు. కనీసం యూట్యూబ్ లోనూ రాకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ బాగా నిరాశకు లోనయ్యారు. గతంలో, విజయ్ సినిమాల ఆడియో లాంచ్ లేదా ప్రీ-రిలీజ్ ప్రోగ్రామ్ యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం అయ్యేది లేదా కార్యక్రమం జరిగిన రెండు రోజుల తర్వాత యూట్యూబ్‌లో విడుదలయ్యేది. అయితే ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ కార్యక్రమం యూట్యూబ్‌లో విడుదల కావడం లేదు. కానీ నేరుగా OTTలో విడుదలవుతోంది.

‘జన నాయగన్’ సినిమా నిర్మాణ సంస్థ కెవిఎన్, ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమ ప్రసార హక్కులను ఓటీటీకి అమ్మేసింది. ఈ ఒప్పందం భారీ మొత్తానికి జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు ‘జన నాయగన్’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జీ5 ఓటీటీలో ప్రసారం కానుంది. జనవరి 4న జీ5లో ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని అభిమానులు పూర్తిగా చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్..

 

మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్, ‘జన నాయగన్’ సినిమా గురించి, అభిమానుల గురించి కూడా భావోద్వేగంగా మాట్లాడారు. ‘నేను ఇసుకలో ఇల్లు కట్టుకోవడానికి వచ్చినప్పుడు, అభిమానులు నా కోసం పెద్ద కోట కట్టారు. కానీ నేను వారి కోసం ఏమీ చేయలేపోయాను. కాబట్టి రాబోయే ముప్పై సంవత్సరాలు నా అభిమానుల కోసం పనిచేస్తాను, నాకు అన్నీ ఇచ్చిన అభిమానుల కోసం నేను సినిమాను వదులుకున్నాను’ అని విజయ్ ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు తన ఎనర్జిటిక్ స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించాడు.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.