టాలీవుడ్ లో బిగ్ వార్.. దసరాకు క్యూ కట్టనున్న భారీ సినిమాలు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

|

Jun 14, 2021 | 3:06 PM

ప్రతీ సంవత్సరం దసరా అంటే.. ఏ ఒకటోరెండో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం చూస్తుంటాం. ఏకంగా టెన్ డేస్ వెకేషన్ కనుక.. ఆడియెన్స్ కూడా ఆ సినిమాల్ని మంచిగా ఆదరించి లాభాలతో సాగనంపుతుంటారు.

టాలీవుడ్ లో బిగ్ వార్.. దసరాకు క్యూ కట్టనున్న భారీ సినిమాలు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..
Follow us on

ప్రతీ సంవత్సరం దసరా అంటే.. ఏ ఒకటో రెండో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం చూస్తుంటాం. ఏకంగా టెన్ డేస్ వెకేషన్ కనుక.. ఆడియెన్స్ కూడా ఆ సినిమాల్ని మంచిగా ఆదరించి లాభాలతో సాగనంపుతుంటారు. అయితే ఈసారి సిట్చువేషన్‌ కంప్లీట్ గా డిఫరెంట్‌గా ఉంది. ఏకంగా నాలుగు దసరాలకు రావాల్సిన మూవీస్‌ ఒకేసారి క్యూ కడుతున్నాయి. దీంతో ఆడియెన్స్ కి నంబరాఫ్ ఆప్షన్స్ పెరిగి… ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటోంది ఫిలిం ఇండస్ట్రీ. జూలైలో థియేటర్లు రీఓపెన్ కావడం పక్కా అని నమ్ముతోంది తెలుగు ఇండస్ట్రీ. ఆగస్టు, సెప్టెంబర్ కల్లా ఆక్యుపెన్సీ రేట్ కొద్దికొద్దిగా పెరిగి.. అక్టోబర్ కల్లా టోటల్లీ సెట్ రైట్ అవుతుందని ఒక అంచనా ఏర్పడింది మేకర్స్ లో. అందుకే ఈసారి అందరికీ దసరా సీజనే హాట్ ఫేవరిట్ కాబోతోంది. సో… ఇప్పటిదాకా పెండింగ్ లో వున్న పెద్ద సినిమాలన్నీ దసరా పదిరోజుల్లోనే క్యూ కట్టే ఛాన్సులు మెండుగా కనిపిస్తున్నాయి.

జులైలో ప్లాన్ చేసుకున్న రాధేశ్యామ్, ఆగస్టులో రిలీజ్ కావాల్సిన పుష్ప, ఎఫ్3 సినిమాలు ఇంకాస్త ముందుకు జరిగి అక్టోబర్ మంత్ ని టార్గెట్ చేస్తున్నాయట. మిగిలున్న ఆ కాస్త ప్రొడక్షన్ నీ, పోస్ట్ ప్రొడక్షన్ నీ చకచకా కంప్లీట్ చేసి.. దసరాకే కర్చీఫులేసే ఆలోచన వీళ్లందరిదీ. ఆల్రెడీ అదే దసరాను నమ్ముకున్న ట్రిపులార్ మూవీ… నాట్ ఎట్ రెడీ అంటూ సైడ్ ఇచ్చుకుంటుందన్నదే… మిగతా సినిమాలకున్న ఆశ. అందుకే ఆ లాంగ్ వీకెండ్ లో మేము సైతం అంటూ అందరూ లాంగ్ జంప్ కి రెడీ అవుతున్నారట. అటు.. మేజర్, ఖిలాడీ, ఘని కూడా కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ ని ఫినిష్ చేసుకుని చలో అక్టోబర్ అంటున్నాయి. ఫస్ట్ వేవ్ తర్వాతొచ్చిన సంక్రాంతి సీజన్.. రెండు బిగ్ హిట్స్ కి ఛాన్స్ ఇచ్చింది. ఈసారి వందశాతం ఆక్యుపెన్సీతో దసరా పదిరోజుల్లో అంతకుమించిన రేంజ్ లో సక్సెస్ రేట్ దక్కుతుందని గెస్ చేస్తోంది ఇండస్ట్రీ. అందుకే.. దసరా వైపు అందరూ ఆశగా చూస్తున్నారన్నది క్రిటిక్స్ మాట.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood : సినిమా ఇండస్ట్రీకి కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు.. నష్టాలు అన్ని ఇన్ని కావు..

Sanchari Vijay: సినీ పరిశ్రమలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో బ్రెయిన్ డెడ్.. అవయవాలను దానం చేసిన..

ఇక్కడ స్టార్ డమ్ వచ్చిన భామలంతా ఇతరభాషల్లోకి జంప్.. కొత్త అందాల వేటలో టాలీవుడ్ డైరెక్టర్లు..