బాలకృష్ణ (Balakrishna)… చూడ్డానికి కరుకుగా కనిపించినా… ఆయన మనసు మాత్రం చాలా మెత్తన అన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రజలకు సేవచేసే బసవతారకం కేన్సర్ హాస్పిటల్ లాంటివాటికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు హరీష్ రావు.. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ ఇరవై రెండేళ్ల సర్వీస్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌లో తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపీ నామా నాగేశ్వర్రావు హాజరై, హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేసే ఇలాంటి హాస్పిటల్స్‌కు ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందన్న హరీష్, వైద్యారోగ్యంలో తెలంగాణ స్టేట్ టాప్-3లో ఉందన్నారు.
ఇక, బసవతారకం హాస్పిటల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ బాలకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన చూడ్డానికి కరుకుగా కనిపించినా, మనసు మాత్రం మెత్తన అంటూ నవ్వులు పూయించారు. బసవతారకం కేన్సర్ హాస్పిటల్ సాధించిన విజయాలను వివరించిన బాలకృష్ణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్న ఆస్పత్రి ఇదేనన్నారు. వంద పడకల సామర్ధ్యంతో ప్రారంభమై, ఇప్పుడు 6వందల బెడ్స్ కెపాసిటీకి చేరిందన్నారు బాలయ్య. అంతేకాదు, కేన్సర్ ట్రీట్‌మెంట్‌లో యావత్ దేశంలోనే సెకండ్ బెస్ట్ హాస్పిటల్‌గా నిలిచిందన్నారు ఆయన.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రిని నందమూరి తారకరామరావు ప్రారంభించారు.. తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకువస్తుంది.. అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని స్టార్ట్ చేశాము.. మా తల్లి బసవతారకం కోరిక మీద ఈ ఆస్పత్రి ప్రారంభించాము…ఆప్పట్లో మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్న వారికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.