CM Revanth Reddy : హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో.. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్‌లో తన గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ స్టూడియో అయిన ఐలైన్ స్టూడియోను నెట్ ఫ్లిక్స్ ప్రారంభించింది. ఇక ప్రపంచ స్థాయి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటిని ఇక్కడి నుంచే క్రియేట్ చేయొచ్చు. ఇది అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, తదుపరి తరం ప్రొడక్షన్ టెక్నాలజీని అందిస్తుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లలో భారతదేశాన్ని ఒక ప్రధాన నోడ్‌గా ఈ స్టూడియో నిలబెడుతుంది.

CM Revanth Reddy : హైదరాబాద్‌లో నెట్ ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో.. ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
Cm Revanth Reddy

Edited By:

Updated on: Mar 12, 2026 | 8:23 PM

భారతదేశంలో ప్రస్తుతం యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగం ఎంతగా అభివృద్ది చెందుతోందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రంగంలో దీర్ఘకాలిక సామర్థ్య పెట్టుబడిని గుర్తించి హైదరాబాద్‌లో తన గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ స్టూడియో అయిన ఐలైన్ స్టూడియోను నెట్ ఫ్లిక్స్ ప్రారంభించింది. ఇక ప్రపంచ స్థాయి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి వాటిని ఇక్కడి నుంచే క్రియేట్ చేయొచ్చు. ఇది అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, తదుపరి తరం ప్రొడక్షన్ టెక్నాలజీని అందిస్తుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లలో భారతదేశాన్ని ఒక ప్రధాన నోడ్‌గా ఈ స్టూడియో నిలబెడుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐలైన్ స్టూడియోస్ CEO జెఫ్ షాపిరో నాయకత్వం వహించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, భారతీయ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి తదితరులు పాల్గొన్నారు.

ఈ కొత్త కార్యాలయం 32000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అధునాతన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్‌ల కోసం అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. ఇవన్నీ బలమైన హైబ్రిడ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సపోర్ట్ చేయబడతాయి. ఉద్యోగుల శ్రేయస్సు, సహకారం, సృజనాత్మకత పెంపొందించడానికి రూపొందించబడిన ఆధునిక కార్యస్థలాన్ని కలిగి ఉంది. లాస్ ఏంజిల్స్, వాంకోవర్, సియోల్, లండన్‌ తరువాత హైదరాబాద్‌లోనే ఐలైన్ స్టూడియోని ప్రారంభించారు. ఐలైన్ స్టూడియోని కలిగి ఉన్న ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది. హై ఎండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్‌, ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేందుకు ఈ స్టూడియో ఉపయోగపడుతుంది.

భారతదేశం ప్రస్తుతం గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది. డిజిటల్ ప్రొడక్షన్, క్రియేటివ్ టెక్నాలజీలో దూసుకుపోతోంది. ఐలైన్ స్టూడియోస్ ఇండియా కార్యాలయం ప్రారంభం దేశంలోని ప్రపంచ ఉత్పత్తి ప్రమాణాలు, అధునాతన సాధనాలు, ఇంటిగ్రేటెడ్ వర్క్‌ఫ్లోలను అందిస్తుంది. హైదరాబాద్‌లో ప్రొడక్షన్, ఆవిష్కరణ సామర్థ్యాలను ప్రోత్సహించడం ద్వారా ఐలైన్ మౌలిక సదుపాయాలు, టాలెంట్ డెవలప్మెంట్, గ్లోబల్ ఇంటిగ్రేషన్‌లో దీర్ఘకాలిక పెట్టుబడిని చేస్తోంది.

ఈ కార్యక్రమంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ..‘ఐలైన్, నెట్‌ఫ్లిక్స్‌లను తెలంగాణకు స్వాగతించడం హైదరాబాద్‌కు గర్వకారణం. హైదరాబాద్ నెట్‌ఫ్లిక్స్‌కు సహజ నిలయంగా నిలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్, నెట్ ఫ్లిక్స్ రెండూ కూడా గ్లోబల్‌గా సక్సెస్ అయ్యాయి. ఈ రెండూ కూడా ఎన్నెన్నో కొత్త అవకాశాల్ని, ఉద్యోగాల్ని సృష్టిస్తూ విజయవంతంగా దూసుకుపోతోన్నాయి. అనేక విధాలుగా నెట్‌ఫ్లిక్స్, హైదరాబాద్ రెండూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను, ప్రతిభను కలిపే ద్వారాలు. మా నగరం ఎల్లప్పుడూ సృజనాత్మకత, సాంకేతికత, ప్రపంచ ప్రతిభ కలిసే ప్రదేశంగా ఉంది. హైదరాబాద్ భవిష్యత్తుకి తగ్గ కథల్ని చెప్పే, రూపొందించే కంపెనీలకు సహజ నిలయంగా మారింది. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా సంబంధిత సృజనాత్మక పర్యావరణ వ్యవస్థలను నిర్మించాలనే మా ఉమ్మడి ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. ఐలైన్ ఉనికి హైదరాబాద్ చలనచిత్రం, సాంకేతికత, AVGC రంగానికి ప్రముఖ కేంద్రంగా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. హైదరాబాద్ నుండి ప్రపంచానికి మన టాలెంట్, మన స్టోరీలు చెప్పడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నందున వారి ప్రయాణానికి నేను ఎల్లప్పుడూ మద్దతు ఇస్తాను’ అని అన్నారు.

నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ ..‘ఈ రోజు నాకు చాలా నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత, చాలా జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం, 2005–2006 ప్రాంతంలో హైదరాబాద్‌లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. టెడ్ సరండోస్ ఆ సమయంలో పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించాడు. నేడు, జెఫ్ షాపిరో వంటి వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఈ ప్రదేశం గురించి సృజనాత్మకతకు తదుపరి కేంద్రంగా మాట్లాడటం చూడటం హైదరాబాద్ ఎంత వరకు అభివృద్ధి చెందిందో చూపిస్తుంది. వరల్డ్ స్థాయి క్వాలిటీ ఉన్న చిత్రాలను డిమాండ్ చేస్తున్న ప్రేక్షకులకు ముందుగా థాంక్స్ చెబుతున్నాను. ఆల్రెడీ సినిమా నిర్మాణంలో మన వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐలైన్ స్టూడియోస్ ఇక్కడికి రావడంతో ఇండస్ట్రీకి మరింత మద్దతు ఇచ్చినట్టు అయింది. నేను వీరందరినీ స్వాగతించాలనుకుంటున్నాను. కళాకారుడిగా సినిమాల్లో పని చేయాలనుకునే లేదా కథ చెప్పడంలో భాగం కావాలనుకునే ఎవరికైనా ఇది గొప్ప అవకాశం. ఈ రంగంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయాణానికి మద్దతు ఇచ్చినందుకు ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వంకు థాంక్స్. మనందరం కలిసి అందమైన, వినోదాత్మక నగరంగా హైదరాబాద్‌ను మారుద్దామ’ని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..

 

Follow Us