బాయిలోన బల్లి పలికే సాంగ్‌ను డిలీట్ చేయాలి.. సింగర్ మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం

టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ సింగర్స్ లో మంగ్లీ పేరు కూడా ఉంటుంది. తనదైన గాత్రంతో అద్భుతంగా పాటలు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మంగ్లీ. కెరీర్ బిగినింగ్ లో న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసి.. ఆ తర్వాత బతుకమ్మ పాటలతో ఫెమస్ అయ్యింది మంగ్లీ. ఆ తర్వాత ఫోక్ సాంగ్స్ తో అలరించింది. జానపద గీతాలతో మంగ్లీకి మంచి పాపులారిటీ వచ్చింది.

బాయిలోన బల్లి పలికే సాంగ్‌ను డిలీట్ చేయాలి.. సింగర్ మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
Mangli

Updated on: Dec 05, 2025 | 5:40 PM

టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరో వివాదంలో.. మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సింగర్ గా మారింది. తెలుగు సినిమాల్లో సాంగ్స్ పాడుతూనే.. ప్రైవేట్ ఆల్బమ్స్ లోనూ అదరగొడుతుంది. రీసెంట్ గా బాయిలోన బల్లి పలికే  అనే సాంగ్ తో అదరగొట్టింది. ఈ సాంగ్ పై ఇటీవలే మేడిపల్లి స్టార్ ఆమె వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో మంగ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈ వివాదం ముగియక ముందే ఇప్పుడు మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది.

బాయిలోన బల్లి పలికే అనే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మిలియన్ వ్యూస్ తో ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఈ సాంగే వినిపిస్తుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ సాంగ్ రీల్స్ తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు బాయిలోన బల్లి పలికే అనే సాంగ్ పై తెలంగాణ ఫోక్‌ సింగర్స్, యాక్టివిస్ట్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జానపద పాటలో ఆమె ఇతర రాష్ట్రాల సంస్కృతిని మిక్స్‌ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ పాటను గుజరాత్‌, రాజస్థాన్‌ సంస్కృతి లో చిత్రీకరించాల్సి అవసరం ఏముందని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పాట డిలీట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ అలా చేయకపోతే దీనిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలంగాణ ఫోక్‌ సింగర్స్, యాక్టివిస్ట్స్‌ హెచ్చరిస్తున్నారు. మరి దీవి పై మంగ్లీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .