RRR : దయచేసి మాస్క్, శానిటైజర్ వాడండి భౌతిక దూరాన్ని పాటించండి.. ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి..

|

May 06, 2021 | 2:49 PM

కరోనా ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. లక్షలాదిమంది ఆసుపత్రిపాలు చేసింది ఈ మహమ్మారి. వేలాది మంది ప్రాణాలను బలికొంది.

RRR : దయచేసి మాస్క్, శానిటైజర్ వాడండి భౌతిక దూరాన్ని పాటించండి.. ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞప్తి..
Rrr
Follow us on

RRR : కరోనా ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. లక్షలాదిమంది ఆసుపత్రిపాలు చేసింది ఈ మహమ్మారి. వేలాది మంది ప్రాణాలను బలికొంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. రోజుకు వందల…వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. కరోనా కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా  మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని భౌతిక దూరం పాటించాలని వైద్యులు, అధికారులు తెలుపుతున్నారు. కరోనాను కట్టడి చేయడం ఇప్పుడు మనచేతిలోనే ఉంది. మాస్క్ లు, శానిటైజర్లు వాడుతూ జాగ్రత్తలు వహిస్తూ కరోనాను మనదేశం నుంచి పారద్రోలాలి.

ప్రజలంతా.. తమ ప్రాణాలకు, దేశం కోసం జాగ్రత్తలు వహించాల్సిన సమయం ఇది. ఎప్పటికప్పుడు అధికారులు, వైద్యులు, సినిమా తారలు, ప్రజలకు అవగాహనా కలిపిస్తూనే ఉన్నారు. తాజాగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ప్రజలకు అవగాహనా కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్ర నటులు రామ్ చరణ్, తారక్, అజయ్ దేవగన్, హీరోయిన్ అలియాభట్, దర్శకుడు రాజమౌళి వివిధ భాషల్లో ప్రజలకు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. తెలుగు, కన్నడ , తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. అందరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్క్ లు, శానిటైజర్లు వాడాలని అలాగే భౌతిక లీదురాన్ని పాటించాలని కోరారు. మనకోసం, మన కుటుంబం కోసం, స్నేహితుల కోసం, చుట్టూ ఉన్నవారికోసం, దేశం కోసం జాగ్రత్తలు వహించాలని కోరారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ లో సుధీప్ తోపాటు మరో యంగ్ హీరో కూడా.. ఆపాత్ర కోసమేన్నా..

బాబాయ్ , బోయపాటి సినిమాలో అబ్బాయి నందమూరి ఫ్యాన్స్‌కు పండగే ! : Kalyan Ram In Balakrishna Movie Video.