సీని నటుడు నందమూరి తారకరత్న మృతితో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇవాళ తారకరత్న అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉదయం 9గంటల 3 నిమిషాలకు మోకిలా నుంచి ఫిల్మ్‌చాంబర్‌కి భౌతికకాయం తరలించనున్నారు. 10 గంటలకల్లా ఫిల్మ్‌చాంబర్‌కు చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌చాంబర్‌లోనే మధ్యాహ్నం వరకు భౌతికకాయం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలయ్యతోపాటు కుటుంబ సభ్యులు పాడెమోశారు. చంద్రబాబు కూడా అంతిమయాత్ర సాగుతున్న వాహనంలోనే వచ్చారు. విజయసాయిరెడ్డి కూడా తారకరత్న అంతిమసంస్కారాల్లో పాల్గొన్నారు. ఉదయం మోకిలాలోని నివాసం నుంచి చాంబర్‌కు భౌతికకాయాన్ని తరలించేప్పుడు పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్ని తారకరత్న కుమారుడి ద్వారా చేయించారు. చాంబర్ నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నప్పుడు మిగతా కార్యక్రమాల్ని ఆయన తండ్రి మోహనకృష్ణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి.
మహాప్రస్థానానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం, కన్నీటి వీడ్కోలు మధ్య సాగిన తారకరత్న అంతిమ యాత్ర
మొదలైన తారకరత్న అంతిమ యాత్ర.. మహాప్రస్థానానికి తారకరత్న పార్థివదేహం
తారకరత్న భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరితో పాటు ఇతర కుటుంబసభ్యులు ఫిల్మ్‌ఛాంబర్ వద్దకు తారకరత్న భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహానికి నివాళులు అర్పించారు నిర్మాత సి.కల్యాణ్. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అలాగే ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన కెరటం నేలరాలిందనిఆయన అన్నారు
తారకరత్న భౌతికాయం దగ్గర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రార్ధనలు చేశారు.
ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నివాళులర్పించారు.
ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించారు నిర్మాత BVSN ప్రసాద్.
ఫిలిం ఛాంబర్‌లో తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించారు జీవిత రాజశేఖర్.
తారకరత్న పార్థివదేహం చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ నటి అన్నపూర్ణమ్మ.
ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్నకు నివాళులర్పిస్తున్నారు సినీ ప్రముఖులు. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు తారకరత్న కోసం అన్ని తామై దగ్గరుండి చూసుకుంటున్నారు బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అనుక్షణం తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి.. పిల్లలకు పక్కనే ఉంటూ ధైర్యం చెబుతున్నారు.
ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు.. అభిమానులు తరలివస్తున్నారు. సీనియర్ నటుడు సాయి కుమార్, నటుడు అజయ్ తారకరత్న భౌతికకాయానికి అంజలి ఘటించారు.
ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన కెరటం నేలరాలిందన్నారు నిర్మాత సి. కళ్యాణ్. ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన.. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న పార్థివదేహానికి నిర్మాత సురేష్ బాబు నివాళులర్పించారు. ఆయనతోపాటు వెంకటేష్ కూడా తారకరత్నకు అంజలి ఘటించారు.
ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న పార్థివదేహాన్ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. మరోవైపు తారకరత్న అంత్యక్రియలు.. అంతిమయాత్రకు సంబంధించిన పనులను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.
తారకరత్న మన మధ్యలేరు అనేది చాలా బాధకరమైన విషయమని అన్నారు బుర్ర సాయి మాధవ్. ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. పార్టీలు.. వర్గాలతో సంబంధం లేకుండా మనస్పూర్తిగా పలకరించే మంచి మనిషి తారకరత్న అని కొనియడారు.
ఫిల్మ్ ఛాంబర్ వద్దకు తారకరత్న కుటుంబసభ్యులు చేరుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరితోపాటు ఇతర కుటుంబసభ్యులు బౌతికకాయం వద్ద నివాళులర్పించారు.
ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న పార్థివదేహానికి విక్టరీ వెంకటేష్ నివాళులర్పించారు.
తారకరత్నను కడసారి చూసేందుకు ఫిల్మ్ ఛాంబర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. ఆయన పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్నారు.
తారకరత్న మృతి చాలా బాధకరమని అన్నారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఫిల్మ్ ఛాంబర్ లో నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తారకరత్న తమ్ముడిలాంటివాడని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆ కుటుంబానికి దైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ చేరుకున్నారు. తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించారు.
ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ.. నటుడు శివబాలజీ తదితరులు నివాళులర్పించారు.
ఫిల్మ్‌చాంబర్‌లోనే నందమూరి కుటుంబసభ్యులు.. కాసేపటి క్రితం ఫిల్మ్‌చాంబర్‌కి చేరుకున్న తారకరత్న తల్లి దండ్రులు మోహన్ కృష్ణ, సీత.
తారకరత్న భౌతికకాయం వద్ద ఆయన భార్య అలేఖ్యారెడ్డి, పిల్లలు విషణ్ణ వదనంతో కూర్చున్నారు. మనసు పడే వేదనకు కన్నీళ్లు కూడా కరువయ్యాయి. తమతో ఎంతో సరదాగా ఉండే తండ్రి విగతజీవిగా తమ ముందే అలా ఉండడంతో ఆ చిన్నారుల గుండె ముక్కలవుతుంది.
ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న భౌతికకాయానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కుమారుడి పార్థివదేహం వద్ద తండ్రి మోహనకృష్ణ, ఇతర కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
నందమూరి తారకరత్న చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఫిల్మ్ ఛాంబర్ లోని తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్న కుటుంబసభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నామన్నారు.
ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం చేరుకుంది. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు పార్థివదేహాన్ని అంబులెన్స్ లో తీసుకువచ్చారు. తారకరత్న భౌతికకాయంతోపాటు.. అంబులెన్స్ లోనే బాలకృష్ణ, విజయసాయిరెడ్డి సైతం ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకున్నారు. తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు ఫిల్మ్ ఛాంబర్ కు అభిమానులు తరలివస్తున్నారు.
తారకరత్న భౌతికకాయం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుంది. మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు పార్థివదేహాన్ని తీసుకువచ్చారు.
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు తరలిస్తున్నారు. అంబులెన్సులో ఆయన పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అంబులెన్సులో తారకరత్న భౌతికకాయం పక్కనే బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మోకిలలోని నివాసం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో భౌతికకాయం ఫిలిం ఛాంబర్ కు తరలుతోంది.
తారకరత్న పార్థివదేహాన్ని మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం 10 గంటల తర్వాత నుంచి ప్రజలు..అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తారకరత్న మరణంతో ఆయన భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో వారి విషయంలో నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారట. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని.. తారక్ కుటుంబానికి నిత్యం అండగా ఉండానని భరోసా ఇచ్చారట. తారకరత్న, బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
మోకిలాలోని తారకరత్న సొంతింట్లో ఆఖరి క్రతువు పూర్తిచేశారు కుటుంబసభ్యులు. ఫ్రీజర్ నుంచి దేహాన్ని బయటకు తీసి తారకరత్న కుమారుడి చేతుల మీదుగా ప్రక్రియ పూర్తి చేశారు. ఇంటినుంచి తారకరత్న భౌతికకాయాన్ని ఫిలం ఛాంబర్ కు తరలిస్తున్నారు. కాసపేట్లో ఫిలిం ఛాంబర్ కు ఆయన భౌతికకాయం చేరుకోనుంది.
బాబాయ్ బాలకృష్ణ అంటే తారకరత్నకి ఎంతో ఇష్టం. అభిమానం. ఏకంగా ఆయన ఫోటోని భుజంపై టాటూ కూడా వేయించుకున్నారు. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దీంతో తారకరత్న అనారోగ్యానికి గురి కావడంతో బాలయ్య తల్లడిల్లిపోయారు. ఇప్పుడు చివరి కార్యక్రమాల్లోనూ బాలయ్యనే దగ్గరుండి చూసుకుంటున్నారు. నిన్న తారకరత్న భౌతికకాయం చూసి భోరున విలపించారు బాలకృష్ణ.
కాసేపట్లో ఫిల్మ్‌చాంబర్‌కి తారకరత్న భౌతికకాయం తరలించనున్నారు. మోకిలాలోని సొంతింట్లో ఆఖరి క్రతువు పూర్తిచేశారు కుటుంబసభ్యులు. ఫ్రీజర్ నుంచి దేహాన్ని బయటకు తీసి తారకరత్న కుమారుడి చేతుల మీదుగా ప్రక్రియ పూర్తి చేశారు.
తారకరత్న భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం నేడు ఫిలింనగర్ లోని ఫిలిం చాంబర్ లో వుంచనున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అక్కడే వుంచి మూడు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నందమూరి కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
తన భర్త తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అలేఖ్యారెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. భర్త భౌతికకాయాన్ని చూస్తూ గుండె పగిలేలా రోదిస్తున్నారు. శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఆమె పూర్తిగా నీరసించి ఆదివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ధైర్యం చెబుతున్నా భర్తను చూసి భోరున విలపిస్తున్నారు.
నందమూరి తారకరత్న అకాల మరణం చిత్రపరిశ్రమలో విషాదం నింపింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి వెళ్లి కన్నీటితో నివాళి అర్పించారు. ఆయన పార్థివదేహాన్ని చూసి బాలకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిరంజీవి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మురళీ మోహన్ , రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, అశ్వినీదత్, రాజశేఖర్, అలీ, నారా రోహిత్, రవిబాబు తదితరులు తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి.. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
తారకరత్న అంత్యక్రియలు ఇవాళ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉదయం 9గంటల 3 నిమిషాలకు మోకిలా నుంచి ఫిల్మ్‌చాంబర్‌కి భౌతికకాయం తరలించనున్నారు. 0గంటలకల్లా ఫిల్మ్‌చాంబర్‌కు ఆయన భౌతికకాయం చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌చాంబర్‌లోనే మధ్యాహ్నం వరకు భౌతికకాయం ఉండనుంది… ఆ తర్వాత 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.