Taraka Ratna: రిలీజ్‌కు రెడీ అయిన తారకరత్న సినిమా.. కానీ ఇంతలోనే

|

Feb 19, 2023 | 12:40 PM

24న రిలీజ్‌ కోసం అంతా సిద్ధం చేయగా ఆయన మృతితో వాయిదా వేసింది యూనిట్. సారా హీరోయిన్‌గా ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పూసల మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Taraka Ratna: రిలీజ్‌కు రెడీ అయిన తారకరత్న సినిమా.. కానీ ఇంతలోనే
Taraka Ratna
Follow us on

తారకరత్న మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. నందమూరి తారకరత్న నటించిన మిస్టర్‌ తారక్ సినిమా విడుదలకు సిద్ధమైంది. 24న రిలీజ్‌ కోసం అంతా సిద్ధం చేయగా ఆయన మృతితో వాయిదా వేసింది యూనిట్. సారా హీరోయిన్‌గా ప్రతిజ్ఞ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పూసల మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మిస్టరీ, థ్రిల్లర్ సినిమాగా ‘మిస్టర్ తారక్’ తెరకెక్కింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ప్రాణ స్నేహితుడు ఒక్కటై మోసం చేస్తే.. హీరో ఏం చేశాడు? అనేది చిత్ర కథగా తెలుస్తోంది. కోరుకున్న లైఫ్ ఇలా రోడ్ ఎక్కింది అంటూ ట్రైలర్‌లో తారక రత్న చెప్పిన డైలాగ్ సినిమా కోర్ పాయింట్ గురించి చెబుతోంది.

తారక రత్న మృతి యూనిట్ మొత్తం షాక్‌కు గురైంది. ఎలాగైనా ఆయన మృత్యువును జయించి వస్తారని అనుకున్నాం, కాని ఘోరం జరిగిపోయిందన్నారు సినిమా నిర్మాత ఆదినారాయణ. 24న విడుదల చేయాలనుకున్న మిస్టర్ తారక్ వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.