దర్శకుడి రూపంలో నీచుడు.. సినిమా ఛాన్స్‌లపేరుతో ఏకంగా 300 మంది యువతుల..

|

Sep 06, 2022 | 9:24 AM

సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు.

దర్శకుడి రూపంలో నీచుడు.. సినిమా ఛాన్స్‌లపేరుతో ఏకంగా 300 మంది యువతుల..
Movie Director
Follow us on

సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. అయితే ఇండస్ట్రీలో నటనతో తోపాటు అదృష్టం కూడా ఉండాలి. అని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువతులకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది తమకు ఎదురైనా సంఘటనలను మీడియా ముందు చెప్పుకొచ్చారు. చిన్న చిన్న ఆర్టిస్ట్ ల దగ్గర నుంచి స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్స్ వరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట పెట్టారు. తాజాగా ఓ దర్శకుడు ఏకంగా 300 మంచి అమ్మాయిలను మోసం చేశాడు. సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తానని.. వారి అశ్లీల ఫోటోలను తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.

సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి యువతుల అశ్లీల దృశ్యాలు చిత్రీకరిస్తూ వారిని జీవితాలతో ఆడుకుంటున్న ఓ దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన వేల్ క్షత్రియన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  తమిళనాడు సేలంలో వేల్ క్షత్రియన్ అనే దర్శకుడు యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు. అతని అసిస్టెంట్ జయ జ్యోతితో కలిసి గదులలో  సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి. యువతుల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి.. ఆ తర్వాత తాను చెప్పినట్టు వినాలని వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ఓ యువతి సూరమంగళం మహిళా పోలీసులకు కంప్లైంట్ చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నీచుడిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా..30కి పైగా హార్డ్ డిస్క్ లు, వాటిలో దాదాపు 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియోలు, ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి