Trisha: నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా.. త్రిషకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు బీజేపీ చీఫ్
ఇటీవల దళపతి విజయ్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించారు తమిళనాడు బీజేపీ అధ్యక్షులు నాగేంద్రన్. త్రిషతో బంధం నుంచి విజయ్ బయటికి రావాలని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష కూడా ఘాటుగానే స్పందించింది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికారి, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ దళపతి విజయ్ తో పాటు ఆయన పార్టీ టీవీకే పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌కి సినిమాల్లో డ్యాన్సులు చేయడం తప్ప రాజకీయాలు తెలియవని, ముందు త్రిషతో ఉన్న బంధం నుంచి బయటకు రావాలని, అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాల్టీ తెలుస్తుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరలయ్యాయి. మరీ ముఖ్యంగా రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని త్రిష పేరును ప్రస్తావించడం తమిళనాడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇక త్రిష కూడా బీజేపీ నేత కామెంట్స్ పై స్పందించింది. తన లాయర్ తో నాగేంద్రన్ కు నోటీసులు పంపించింది.
‘త్రిషకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. అయినా రాజకీయ నాయకులు వారి స్వార్థ రాజకీయాల కోసం త్రిష పేరును వాడటం సరికాదు. అనవసర విషయాలల్లో లాగితే చట్ట పరమైన చర్యలు తప్పవు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతగా ప్రవర్తించాలి’ అంటూ త్రిష తరపు లాయర్ ప్రకటన విడుదల చేశారు. దీనికి తోడు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వెనక్కు తగ్గారు. త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు ఎవరి మనసును బాధ పెట్టే ఉద్దేశం లేదంటూ త్రిష గురించి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలియజేశారు. మరి బీజేపీ అధ్యక్షుడి క్షమాపణలతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Nainar Nagendran of the Bharatiya Janata Party has apologised to Trisha Krishnan over the remarks he made earlier.#ThalapathyVijay #Vijay #Trisha #TVKVijay https://t.co/XCjItZOto8
— Telugu Chitraalu (@CineChitraalu) February 16, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




