హారర్ కామెడి ఎంటర్టైనర్స్ కు ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ దక్కుతోంది. హారర్ కామెడీ సినిమాలు ఎప్పుడు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఈ జోనర్ లో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా ఇదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఓ సినిమా. ఆ సినిమా పేరే డీ డీ రిటర్న్స్ భూతాల బంగ్లా. కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతానం ఈ సినిమాలో హీరోగా నటించాడు. తమిళనాట సంతానం కమెడియన్ గా చాలా సినిమాల్లో నటించాడు. ఇక డీ డీ రిటర్న్స్ సినిమా తమిళ్ లో ముందుగా రిలీజ్ అయ్యింది. అక్కడ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తెలుగులోకి రిలీజ్ చేశారు.
ఇక థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగు వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో డీ డీ రిటర్న్స్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ దక్కుతున్నాయని తెలుస్తోంది. భయపెట్టే సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఈ మూవీ ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.