Varalaxmi Sarathkumar: ‘జయమ్మ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? వరలక్ష్మి బర్త్‌డే స్పెషల్‌ స్టోరీపై ఓ లుక్కేయండి..

|

Mar 05, 2021 | 12:32 PM

Varalaxmi Sarathkumar Birthday: వరలక్ష్మి శరత్‌ కుమార్ దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. ఇక తెలుగులో మొన్నటి వరకు పెద్దగా తెలియని ఈ పేరు ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన 'క్రాక్‌' సిసినిమాతో..

Varalaxmi Sarathkumar: జయమ్మ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? వరలక్ష్మి బర్త్‌డే స్పెషల్‌ స్టోరీపై ఓ లుక్కేయండి..
Follow us on

Varalaxmi Sarathkumar Birthday: వరలక్ష్మి శరత్‌ కుమార్.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి పరిచయం ఉండే ఉంటుంది. ఇక తెలుగులో మొన్నటి వరకు పెద్దగా తెలియని ఈ పేరు ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన ‘క్రాక్‌’ సిసినిమాతో మారుమోగింది. ఈ సినిమాలో ‘జయమ్మ’ పాత్రలో నటించిన వరలక్ష్మి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే హీరో శరత్‌ కుమార్‌ గారాల పట్టి వరలక్ష్మి నేటితో (మార్చి 5) 36వ పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మి కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..
హీరో శరత్‌కుమార్‌, చాయా జంటకు వరలక్ష్మి 1985 మార్చి 5 జన్మించారు. నలుగురు సంతానంలో వరలక్ష్మి పెద్దమ్మాయి. ఇక వరలక్ష్మి చెన్నైలోని హిందుస్తాన్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో మైక్రో బయోలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. అనంతరం.. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్ఘ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది.  అనంతరం ఇండియా చేరుకున్న వరలక్ష్మి ముంబైలోఉన్న అనుపమ్‌ కేర్‌ యాక్టింగ్‌ స్కూల్‌లో నటనలో శిక్షణ పొందింది.

‘బాయ్స్‌’లో అవకాశం వచ్చినా..

వరలక్ష్మికి 2003లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్‌’ చిత్రం ద్వారానే సినిమా అవకాశం తొలిసారి తలుపుతట్టింది. అయితే తండ్రి శరత్‌కుమార్‌ సూచన మేరకు ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక అనంతరం 2004లో వచ్చి కాదల్‌, 2008లో వచ్చి ‘సరోజ’ చిత్రాల్లోనూ వరలక్ష్మి అవకాశాన్ని కోల్పోయింది. 2003లో సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టిన వరలక్ష్మి 2012లో విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో వచ్చి ‘పోడా పొడి’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

తెలుగులో తొలిసినిమా..

తమిళంలో వరుస సినిమాలు చేస్తోన్న సమయంలోనే వరలక్ష్మి తెలుగులో ఎంటర్‌ ఇచ్చింది. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. ఇక తాజాగా వచ్చిన ‘క్రాక్‌’ చిత్రంతో ఒక్కసారిగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఈ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళంలో ఏకంగా 6 సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

మరికొన్ని విశేషాలు..

* సినిమాల్లోకి వెళతానని మొదట్లో చెప్పగానే శరత్‌ కుమార్‌ వరలక్ష్మిని వారించారట. కానీ చదువు పూర్తయ్యాక అడిగేసారికి ఓకే చెప్పారు.
* కెరీర్‌ ప్రారంభంలోనే వరలక్ష్మి కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంది. కొంతమంది వ్యక్తులు తనతో అసభ్యకరంగా వ్యవహరించారని వరలక్ష్మి స్వయంగా చెప్పుకొచ్చారు.
* వీధి కుక్కులకు ఆశ్రయం కల్పించే క్రమంలో వరలక్ష్మి ‘సేవ్‌ శక్తి’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు.
* వరలక్ష్మి తమిళంలో ఓ టీవీ షోలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది.
* కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో వరలక్ష్మి నటిస్తోందని చర్చ జరుగుతోంది.

Also Read: A1 Express Movie Twitter Review : ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ1 ఎక్స్‌‌‌‌ప్రెస్.. హాకీ ఆటగాడిగా ఆకట్టుకున్న సందీప్ కిషన్

Pooja Hegde : దళపతి సినిమాలో బుట్టబొమ్మ.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన బ్యూటీ.. ఏకంగా