
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వశిష్ట, చిరు కాంబోలో విశ్వంభర సినిమా వస్తుండగా..మరోవైపు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వరుస హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు చిరుతోనే మరో సక్సెస్ అందుకోవడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్టింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలవడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు పంచడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
తాజాగా ఫిల్మ్ సర్కిల్ల్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో చిరంజీవితో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో తమన్నా స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆమె నటించిన కావాలయ్యా, డాడా దాస్ వంటి పాటలు షేక్ చేశాయి. అలాగే హిందీలోనూ వరుసగా స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇటీవల ఆమె నటించిన ఆజ్ కీ రాత్ పాట సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు చిరుతో కలిసి స్టెప్పులేయనుంది.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
వీరిద్దరి కాంబోలో వచ్చే సాంగ్ అదిరిపోయే కిక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం ఇప్పటికే భారీ సెట్ నిర్మించి.. గ్రాండ్ గా చిత్రీకరించేందుకు సన్నహాలు చేస్తుందట. పూర్తిస్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని.. ముఖ్యంగా మెగా మాస్ అభిమానులను ఆకట్టుకోనున్నట్లు టాక్. అలాగే సంగీత దర్శకుడు థమన్ అందించే మ్యూజిక్ మరో హైలెట్ కానుందట.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..