Sushmita Sen: గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత సుష్మితా సేన్ ఏం చేస్తుందో తెలుసా ?..

కొద్ది రోజులుగా ఆమె అడిసన్స్ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా హోలీ సందర్భంగా హార్ట్ ఎటాక్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి తన వ్యాయమాలను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు సుష్మిత.

Sushmita Sen: గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత సుష్మితా సేన్ ఏం చేస్తుందో తెలుసా ?..
Sushmita Sen

Updated on: Mar 08, 2023 | 1:00 PM

మాజీ విశ్వ సుందరి, నటి సుష్మితా సేన్ ఇటీవలే తీవ్ర గుండెపోటు బారిన పడిన సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్‏కు యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తన గుండెలోని ప్రధాన ధమని 95 శాతం బ్లాక్ అయ్యిందని.. కానీ ముంబై నానావతి ఆసుపత్రి వైద్యులు ఆమెకు స్టెంట్ వేసి వైద్యులు తన ప్రాణాలు కాపాడారని తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు మాజీ విశ్వ సుందరి. కొద్ది రోజులుగా ఆమె అడిసన్స్ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా హోలీ సందర్భంగా హార్ట్ ఎటాక్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి తన వ్యాయమాలను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు సుష్మిత.

1994లో విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న సుష్మిత.. తర్వాత హిందీతోపాటు తెలుగులోనూ ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం నటనకు దూరమై.. పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లలతో ఇంటి పట్టునే ఉంటున్నారు. అంటూ వెండితెరపై బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు సుష్మిత. తాజాగా సుష్మిత సోషల్ మీడియా వేదికగా అభిమానులకు హోలీ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వివరణ ఇచ్చుకున్నారు. ప్రధాన ధమనుల్లో ఒకటి 95 శాతం బ్లాక్ అయ్యిందని, వైద్యులు యాంజియో ప్లాస్టీ ద్వారా సమస్యను పరిష్కరించినట్టు ఆమె చెప్పారు. ఇక, సర్జరీ తర్వాత వైద్యుల సూచనల మేరకు మళ్లీ వ్యాయామాలు కూడా మొదలు పెట్టింది.

ఇవి కూడా చదవండి

నడుము కింద రింగ్ పెట్టుకుని కాళ్లూ, తలను కిందకు ఆనించడం వల్ల ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసుకునేందుకు వైద్యులు అనుమంచినట్టు తెలిపింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోను షేర్ చేసింది. యోగావీల్ అనేది బేసిక్ స్ట్రెచింగ్ వ్యాయామం. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, నమ్మకం ఏర్పడుతుందంటూ కామెంట్ చేశారు సుస్మిత. వర్కవుట్ వీడియో ఫోటో షేర్ చేస్తూ.. ‘మీ మనసును ఎప్పుడూ సంతోషంగా ఉంచండి. అలాగే ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. అది మీకు అవసరమైనప్పుడు అండగా ఉంటుంది. ఇవి నా తండ్రి నాకు ఎప్పుడూ చెప్పే మాటలు. ఇటీవల నాకు గుండె పోటు వచ్చింది. యాంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడిప్పుడె కోలుకుంటున్నాను’ అంటూ రాసుకోచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.