
వెంకటేశ్, మీనా జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో సూర్య వంశం ఒకటి. అప్పట్లో ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇందులో వెంకీ తనయుడిగా కనిపించిన కుర్రాడు గుర్తున్నాడా.. ? చిన్నప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. అప్పట్లో ఆ కుర్రాడు మోస్ట్ డిమాండ్ ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు హీరోగా అలరించేందుకు రెడీ అయ్యాడు. అతడు హీరోగా నటించిన సినిమా నిదురించు జహాపన. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ఆనంద్ హర్షవర్దన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆనంద్ వర్ధన్, 24 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి సినీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. బాల నటుడిగా “సూర్యవంశం”, “బాలరామాయణం” వంటి చిత్రాలలో నటించి, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ వంటి లెజెండరీ నటులతో కలిసి పని చేశారు. చిన్నతనంలో 25 చిత్రాలలో నటించిన ఆనంద్ వర్ధన్, చదువుల కోసం సినిమాలకు దూరమయ్యారు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
సుదీర్ఘ విరామం తర్వాత సినీ రంగంలోకి తిరిగి ప్రవేశిస్తున్నారు. కేవలం నాలుగు సంవత్సరాల వయస్సులోనే “బాలరామాయణం” చిత్రంతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఎనిమిదో తరగతి వరకు సుమారు 25 చిత్రాలలో నటించారు. వీటిలో “సూర్యవంశం” వంటి ఎవర్ గ్రీన్ హిట్లు కూడా ఉన్నాయి. 24 సంవత్సరాల పాటు వెండితెరకు దూరంగా ఉండటానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. ప్రాథమికంగా, బీటెక్ విద్యను పూర్తి చేయడం కోసం ఈ విరామం తీసుకున్నానని, ఇది ప్రణాళికాబద్ధమైన గ్యాప్ అని వివరించారు. విద్య పూర్తయిన తర్వాత, నటుడిగా తిరిగి రావడానికి తన శరీరాకృతిని మార్చుకున్నారు. జిమ్‌లో శిక్షణ పొంది, డ్యాన్స్, పోరాట విద్యలను అభ్యసించి రెడీ అయ్యారు. ఈ ప్రయాణంలో అనుకోకుండా ఒక షూటింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి రెండు నెలల పాటు ఐసీయూలో గడపాల్సి వచ్చిందని ఆనంద్ వర్ధన్ తెలిపారు. ఆ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం, నిర్మాణ బాధ్యతలు వహించారని, ఆయనే ఆ సమయంలో తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
ఆనంద్ వర్ధన్ ప్రముఖ గాయకుడు పీ. బీ. శ్రీనివాస్ గారి మనవడు కావడం వల్ల, పరిశ్రమలో తన తాతగారి పట్ల ఉన్న గౌరవం, అభిమానం తనకు కూడా లభిస్తున్నాయని అన్నారు. అయితే, తాను కేవలం తాతగారి పేరుతో కాకుండా, తన పనితీరుతో గుర్తింపు పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం “ఆన్ ది వే” అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఆయన, ఈ సినిమా టైటిల్ కూడా తన ప్రస్తుత ప్రయాణాన్ని సూచిస్తుందని చెప్పారు. తాను కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉన్నానని, తన పనికి తగిన గుర్తింపు లభించడమే తన లక్ష్యమని ఆనంద్ వర్ధన్ వెల్లడించారు
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..