Suriya: ‘రోలెక్స్.. నా గుర్తింపు మార్చేసింది’.. సూర్య స్పీచ్‏కు స్టేజ్ దద్దరిల్లాల్సిందే..

|

Oct 29, 2023 | 12:57 PM

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, వాగై చంద్రశేఖర్, సునీల్ వర్మ, విజయ్ మిల్టన్, కేఎస్ రవికుమార్, భావ చెలతురై, జితన్ రమేష్ తదితరులు నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా శనివారం చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. కార్తితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

Suriya: రోలెక్స్.. నా గుర్తింపు మార్చేసింది.. సూర్య స్పీచ్‏కు స్టేజ్ దద్దరిల్లాల్సిందే..
Suriya
Follow us on

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన జపాన్ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. రాజు మురుగన్ దర్శకత్వంలో నటుడు కార్తీ నటించిన చిత్రం “జపాన్”. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, వాగై చంద్రశేఖర్, సునీల్ వర్మ, విజయ్ మిల్టన్, కేఎస్ రవికుమార్, భావ చెలతురై, జితన్ రమేష్ తదితరులు నటించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా శనివారం చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి సూర్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. కార్తితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అలాగే విక్రమ్ సినిమాలో తాను పోషించిన రోలెక్స్ పాత్ర తన గుర్తింపును.. సినీ ప్రయాణాన్ని మార్చేసిందని అన్నారు.

సూర్య మాట్లాడుతూ..’ చదువు పూర్తయ్యాక గార్మెంట్స్ వ్యాపారం చేసి సినిమాల్లోకి వచ్చాను. నా స్టైల్‌, కార్తీ స్టైల్‌ రెండూ డిఫరెంట్‌. కైలీ కట్టుకోవడం, మద్యం తాగడం వంటి సన్నివేశాలు ఉన్న కథ వస్తే దానిని కార్తీకి పంపిస్తాను. కానీ నా లుక్‌ని పూర్తిగా మార్చేసింది మాత్రం డైరెక్టర్ లోకేష్‌. విక్రమ్ సినిమాలో రోలెక్స్ లాంటి క్యారెక్టర్ ఇచ్చి నా ప్రయాణాన్ని మార్చేశాడు. గత ఏడాది కాలంగా అభిమానులను పెద్దగా కలవలేదు. ఇప్పుడు నేను నటిస్తోన్న కంగువా సినిమా కోసం అడియన్స్ ఎదురుచూస్తున్నారు. సినిమా అద్భుతంగా సిద్ధమవుతోంది. అభిమానులు తప్పకుండా సెలబ్రెట్ చేసుకుంటారు. దిల్లీ (ఖైదీ 2) ఎప్పుడైతే రిటర్న్ అవుతాడో .. అప్పుడే రోలెక్స్ తిరిగి వస్తాడని నేను విటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య చివరిసారిగా గత ఏడాది విడుదలైన ఎదిరుం వతిందావన్ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో కంగువ సినిమాలో నటిస్తున్నాడు. 3డి టెక్నాలజీలో 10 భాషల్లో రూపొందనున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే సూరరైపూటుతో తనకు భారీ విజయాన్ని అందించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య మరోసారి ఓ చిత్రంలో నటించనుండడం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.