Suriya: అప్పుడు సూర్యతో కలిసి చదువుకున్నాడు.. ఇప్పుడు తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సూర్య. తనదైన నటనతో, యాక్షన్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో స్పెషల్ మార్క్ వేశారు. ఇటీవలే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగులో ఓ స్టార్ హీరో సూర్య క్లాస్ మేట్ అని మీకు తెలుసా.. ?

Suriya: అప్పుడు సూర్యతో కలిసి చదువుకున్నాడు.. ఇప్పుడు తెలుగులో తోపు హీరో.. ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
Suriya

Updated on: Aug 23, 2026 | 4:55 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవలే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే.. సూర్యకు తెలుగు హీరోలతో మంచి అనుబంధం ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలుగులో తన బెస్ట్ ఎవరనే విషయాన్ని సైతం వెల్లడించారు. అయితే సూర్యతోపాటు కలిసి చదువుకున్న కుర్రాడు ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో. సూర్య ఇటీవల సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా గురించి, అలాగే సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తన స్కూల్ రోజుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యువన్‌ శంకర్‌ రాజాపై తనకు ఎంతో గౌరవం ఉందని, అతనితో తన ప్రయాణం 18 ఏళ్లుగా కొనసాగుతోందని సూర్య తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్‏బాస్‏లోకి ఈశ్వర సాయి, మాధురి రాథోడ్.. ఆది రెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ?

చిన్నప్పటి నుంచి యువన్‌ను చూస్తున్నానని, పల్లెలలో కూర్చుని పియానో వాయించే రోజుల నుంచి అతని కృషిని గమనించానని పేర్కొన్నారు. యువన్‌ సంగీతం తన తొలి చిత్రాలకు మంచి విజయాన్ని అందించిందని, తాను అతని వీరాభిమానినని సూర్య స్పష్టం చేశారు. అంతేకాదు, సూర్య, యువన్‌ శంకర్‌ రాజా, మరియు మహేష్ బాబు ఒకే స్కూల్‌లో చదువుకున్నారని సూర్య గుర్తుచేసుకున్నారు. చెన్నైలోని సెయింట్ బీడ్స్‌లో వీరంతా క్లాస్‌మేట్స్ అని, తన సోదరుడు కార్తీ కూడా అక్కడే చదివారని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఈ స్నేహితులందరూ కలిసి ప్రయాణించారని, వారికి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని సూర్య పంచుకున్నారు. మహేష్ బాబు తన క్లాస్‌మేట్ అని సూర్య చెప్పిన ఈ విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఎక్కువ మంది చదివినవి : Sowcar Janaki: షావుకారు జానకి మనవరాలు తెలుగులో పెద్ద హీరోయిన్.. చాలా ఫేమస్.. ఎవరో

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: రహస్య బావిలో మహిళ అరుపులు.. భయంతో వణికిపోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ థ్రిల్లర్..

మహేష్ బాబు, సూర్య..

Suriya, Mahesh Babu

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో మాములోడు కాదు.. నెంబర్ వన్ ఫ్రాడ్.. సీనియర్ నటుడు సురేష్..

Loading...
Unable to load recommendations.
Follow Us