నటుడు కమల్‌హాసన్ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. అన్ని ఇండస్ట్రీల్లో కమల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అందరు ఆయనను యూనివర్సల్ హీరో అంటుంటారు. కమల్ హాసన్ 69వ పుట్టినరోజు నేడు (నవంబర్ 7). కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా కమల్ కు ఆయన అభిమానులు, సినిమా సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తన స్నేహితులకు ఘనంగా బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశాడు కమల్. ఒకరోజు ముందుగా అంటే నవంబర్ 6వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు పాల్గొన్నారు.
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా పార్టీకి రావడం విశేషం. ఆయన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. కమల్ హాసన్ పుట్టినరోజు వేడుక చెన్నైలో జరిగింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ కూడా చెన్నైలోనే ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకునేందుకు చెన్నై వచ్చాడు అమీర్. అందుకే కమల్ హాసన్ బర్త్ డే పార్టీకి అమీర్ ఖాన్ హాజరు కాగలిగాడు. అలాగే స్టార్ హీరో సూర్య కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడు. సినిమాటోగ్రాఫర్ రవి చందన్ కే. ఈ స్టార్ నటులతో సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు.
‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గజినీలు’ అన్నారు రవి కె. చంద్రన్ ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. తమిళంలో సూర్య నటించిన చిత్రం ‘గజిని’. అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసినప్పుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే రవి కె. చంద్రన్ ఇలా క్యాప్షన్ పెట్టాడు. 2005లో విడుదలైన తమిళ చిత్రం ‘గజిని’. 2008లో హిందీ చిత్రం ‘గజిని’ విడుదలైంది. ఈ సినిమా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.
కమల్ హాసన్ పుట్టినరోజు వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. గతేడాది ‘విక్రమ్’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ‘భారతీయుడు 2’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. దర్శకుడు మణిరత్నంతో ‘థగ్ లైఫ్’ వర్క్ కూడా జరుగుతోంది.