Surekha Vani About Her Second Marriage: ఇటీవల గాయని సునీత రెండో వివాహం చేసుకోవడంతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆమె అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఫీలయ్యారు. ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితం గడిపిన సునీత తన కొడుకు, కూతురు కోరిక మేరకు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
తాజాగా మరో నటి సురేఖ వాణి కూడా రెండో వివాహం చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి. దీంతో సురేఖ రెండో వివాహంపై చర్చ మొదలైంది. సునీతలాగే సురేఖ కూడా తన కూతురు సుప్రీత ఒత్తిడి మేరకే రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధమవతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సురేఖ తాజాగా స్పందించారు. తన రెండో వివాహంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. మరోసారి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. సురేఖ భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా మరణించారు. ఇదిలా ఉంటే యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన సురేఖ.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సురేఖ.. ఇటీవలి కాలంలో తన కూతురితో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
Also Read: K.G.F Chapter 2 : భారీ ధరకు ‘కేజీఎఫ్’ 2 తమిళ రైట్స్.. దక్కించుకుంది ఎవరో తెలుసా..