Cinema : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ….ఏం జరిగిందంటే ?

సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది సుప్రీంకోర్టు . ఈ కేసుపై విచారణ జరిపింది జస్టిస్‌లు జెకె మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం. టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్.

Cinema : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ....ఏం జరిగిందంటే ?
Cinema Ticket Price

Edited By:

Updated on: Mar 13, 2026 | 6:47 PM

తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది..సినిమా టికెట్ ధరల పెంపుపై ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది…టికెట్ రేట్లు పెంచుతున్నట్లు సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని జనవరిలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై విచారణ జరిపిన జస్టిస్‌లు జెకె మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం స్టే విధించింది..మన శంకర వర ప్రసాద్ గారు సినిమా టికెట్ ధరను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన దాచేపల్లి చంద్రబాబు వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది …గతంలో దాచేపల్లి చంద్రబాబు టికెట్ల రేట్ల పెంపు పై ప్రేక్షకులతో సహా వాటాదారుల సమాచార హక్కును ఉల్లంఘించారని ఆరోపించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

దీంతో భవిష్యత్తులో ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంటే, సినిమా విడుదలకు తొంభై (90) రోజుల ముందు అటువంటి నిర్ణయాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది..తెలంగాణ హైకోర్టు ఆదేశాల వల్ల సినిమా నిర్మాణ సంస్థలకు నష్టం జరుగుతుందని భావించిన మైత్రీ మూవీ మేకర్స్ హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. ఈ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇస్తూ ప్రతివాదులుగా ఉన్న దాచేపల్లి చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వం, కమిషన్ ఆఫ్ పోలీస్,షైన్ స్క్రీన్స్ ఇండియా లిమిటెడ్,తెలంగాణ ఫిల్మ్ కార్పొరేషన్ ఎండీ కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది..మార్చి 20 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

గతంలో ఇదే అంశం పై దాఖలైన షైన్ స్క్రీన్స్ పిటిషన్ తో కలిపి తదుపరి వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది…ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంపై షైన్ స్క్రీన్ సంస్థ సైతం సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది..తాజాగా మైత్రి మూవీ మేకర్స్ వేసిన పిటిషన్ ను షైన్ స్క్రీన్ సంస్థ పిటిషన్ తో జత చేయాలని రిజిస్ట్రీని జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం ఆదేశించి తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రతివాదులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా టికెట్ల రేట్ల పెంపు పై సుప్రీంకోర్టు లో తదుపరి విచారణ ఉండబోతుంది.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us