సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అటు కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా రమ్యకృష్ణ నటించారు. స్క్రీన్ ప్లే పరంగానూ, కలెక్షన్ల పరంగానూ జనాల ఆదరణ పొందింది జైలర్ సినిమా. అలాగే జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఇక ఇప్పుడు జైలర్ 2 సినిమా చేస్తున్నారు రజినీకాంత్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా జైలర్ 2 టీజర్ ను విడుదల చేశారు. జైలర్ 1లో రజనీకాంత్‌తో కలిసి రమ్యకృష్ణ, వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్ మరియు యోగి బాబు నటించారు. ఇదే టీమ్ ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నెల్సన్.
తాజాగా విడుదలైం జైలర్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ టీజర్‌కి జనాల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ టీజర్‌లో మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమాలో మరింత వైలెన్స్ ఉండనుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.