Love Story: నాగచైతన్య -సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’కి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్..

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Love Story: నాగచైతన్య -సాయిపల్లవి లవ్ స్టోరీకి సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్..
Love Story

Updated on: Sep 22, 2021 | 9:08 AM

Love Story:  సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్‌గా విడుదలైన లవ్ స్టోరీ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరూ తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది.  ఈ సినిమానుంచి విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సారంగదరియా పాట ఒక ఊపుఊపేసింది.

ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ అందించారు. మహేష్ సోషల్ మీడియా వేదికగా లవ్ స్టోరీ సినిమా పై ప్రసంశలు కురిపించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తన ట్విట్టర్ లో షేర్ చేశారు మహేష్. అలాగే “డ్యాన్స్  నేపథ్యంలో సాగే సినిమా ఇది. తెలుగులో ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయి. థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటానికి  నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ‘లవ్ స్టోరీ’ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అని పేర్కొన్నారు మహేష్. కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు. రాజీవ్ కనకాల – ఈశ్వరీ రావు – దేవయాని – ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case : చివరికి చేరుకున్న ఈడీ విచారణ.. నేడు అధికారుల ముందుకు హీరో తరుణ్

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)

Follow Us