ఇట్స్ మై టర్న్ అంటూ ఎలర్ట్ అయ్యారు హీరో మహేష్‌బాబు(Mahesh Babu). ఆచార్య సందడి అలా సద్దుమణిగిపోగానే చార్జ్ తీసుకుని.. దూకుడు పెంచేశారు సూపర్‌స్టార్. సర్కారువారి పాట ఫ్యూచర్ ఏంటి అనే టాపిక్ మీద చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఇంతకీ ఈ పీక్ టైమ్‌లో మహేష్ కేరాఫ్ ఎక్కడున్నట్టు.. బాలయ్యతో మొదలైన దండయాత్ర, ఐకాన్‌స్టార్ పుష్ప, పవర్‌స్టార్ భీమ్లానాయక్, డార్లింగ్ రాధేశ్యామ్, జక్కన్న ట్రిపులార్… అన్నీ దాటుకుని… మెగాస్టార్ ఆచార్య దాకా వచ్చి ఆగింది. కోవిడ్ థర్డ్ వేవ్ తర్వాత తమతమ మార్కెట్ సైజుల్ని ఇలా రీచెక్ చేసుకుంటున్న హీరోల జాబితాలో తర్వాతి వంతు సూపర్‌స్టార్‌దే. రెండేళ్ల హెవీ వెయిటింగ్ తర్వాత మే 12న రాబోతోంది సర్కారువారి పాట.
మూడు పాటలు, ఒక టీజర్‌తో బిగ్ రేంజ్‌లో హైప్ తెచ్చుకున్న ఈ సినిమా.. సోమవారం రిలీజయ్యే ట్రయిలర్ మీద ఫోకస్ పెట్టింది. కౌంట్‌డౌన్ పోస్టర్స్‌తో సర్కారువారి పాట ట్రయిలర్‌ని ట్రెండ్‌లో నడిపిస్తున్నారు ఘట్టమనేని హీరో ఫ్యాన్స్. అటు.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేషుల్ని రంగంలోకి దింపి ఫస్ట్ రౌండ్ ప్రమోషన్స్‌ని షురూ చేసుకుంది సర్కారువారి పాట. మోస్ట్ ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్ అని, కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో పోకిరీకి మించి ఉంటుందని సర్కారువారి పాటపై టెక్నీషియన్స్ నుంచి సాలిడ్ హింట్ వచ్చేసింది. బ్రాండ్ న్యూ ఇమేజ్ కోసం కొత్తగా ట్రై చేస్తున్నారన్న విషయాన్ని తన గెటప్ అండ్ మేనరిజమ్స్‌తో ఆల్రెడీ చెప్పేశారు మహేష్‌బాబు. సర్కారు చివరి పాట షూటింగ్ ముగించుకుని రిలాక్స్ మోడ్‌లో వున్న మహేష్‌బాబు.. సమ్మర్ వెకేషన్ కోసం పారిస్ వెళ్లారు. తిరిగొచ్చాక జూన్‌లోనే గురూజీ క్యాంప్‌లో చేరిపోతారు. అటు.. సరిలేరు నీకెవ్వరుతో తనకు బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిల్‌రావిపూడితో మళ్లీ టచ్‌లోకొచ్చారట మహేష్‌బాబు. ఇలా.. కొత్తకొత్త అప్‌డేట్స్‌తో సర్కారువారి పాట చుట్టూనే తిరుగుతోంది టోటల్ ఫిలిమ్‌నగర్.
మరిన్ని ఇక్కడ చదవండి :