Sarkaru Vaari Paata: బార్సిలోనాలో డ్యూయట్స్ పాడుకుంటున్న సూపర్ స్టార్ మహేష్- కీర్తి సురేష్..

|

Oct 19, 2021 | 5:23 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది.

Sarkaru Vaari Paata: బార్సిలోనాలో డ్యూయట్స్ పాడుకుంటున్న సూపర్ స్టార్ మహేష్- కీర్తి సురేష్..
Mahesh
Follow us on

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో తొలిసారి మహేష్ బాబుతో మహానటి కీర్తి సురేష్ స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగా జరుగుతుంది. దాదాపు 70 శాతం షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను స్పెయిన్‌లో జరిపారు. ఇక ఇప్పుడు అందమైన లొకేషన్స్‌లో మహేష్ కీర్తి సురేష్ పైన డ్యూయట్స్‌ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ న్యూ స్టైల్ లో కనిపించనున్నాడు. ఇటీవలే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్. ప్రస్తుతం సాంగ్స్ కోసం బార్సిలోనా పయనమయ్యారట. అక్కడి అద్బుతమైన అందమైన లొకేషన్స్‌లో మహేష్ -కీర్తి పై పాటల చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ ఇద్దరి కాంబో సన్నివేశాలు, అలాగే వీరిద్దరి మద్య సాగే లవ్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా ఉంటాయి అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల చివరి వరకు స్పెయిన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేయనున్నారట.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్

Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..

Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..