బెంగళూరు కోర్టులో నటుడు రజినీకాంత్ భార్యకు ఊరట లభించింది. చీటింగ్ కేసులో లతా రజినీకాంత్‌కు బెయిల్ మంజూరైంది. కొచ్చాడియన్ చిత్రం విషయంలో.. రూ.6.50 కోట్లు మోసం చేశారంటూ బాధితుడు కోర్టుకెక్కాడు. కేసు విచారించిన బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొచ్చాడియన్ సినిమా విషయంలో రూ.6.5కోట్లు బాకీ రావలసి ఉందని యాడ్ బ్యూరో కేసు నమోదు చేసింది. అప్పట్లో పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఈ సంస్థ పనిచేసింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌కు రూ. 10 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. లతా రజనీకాంత్ పై మొదట అడిషనల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తొలి కేసు దాఖలైంది. ఆ తర్వాత 2014లో ఉల్సూర్ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.