డాన్స్‌తో ఇరగదీసిన తలైవా.. సూపర్ స్టార్ స్టెప్పులకు ఆడిటోరియం అదిరిపోయింది

రజనీకాంత్ చివరిగా నటించిన 170వ చిత్రం వేటయన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జైబీమ్ ఫేమ్ టి.ఎస్.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. జైలర్ తర్వాత మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, తుషార విజయన్ ప్రధాన పాత్రలు పోషించారు.

డాన్స్‌తో ఇరగదీసిన తలైవా.. సూపర్ స్టార్ స్టెప్పులకు ఆడిటోరియం అదిరిపోయింది
Rajinikanth

Updated on: Mar 01, 2025 | 8:04 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ రాకముందే సూపర్ స్టార్ కు పాన్ ఇండియా క్రేజ్ ఉంది. ఇటీవలే జైలర్ సినిమాతో రజినీకాంత్ సంచలన విజయం అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూల్ చేసింది ఈ సినిమా. అలాగే రీసెంట్ గా ఆయన తన కూతురు దర్శకత్వంలో ఓ సినిమా చేశారు. లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజిని. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వెట్టాయన్ ఇదిలా ఉంటే సూపర్ స్టార్ నటించిన సినిమాల్లో బాషా సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్.. అసలు ఈ సినిమాతోనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు మొదలయ్యాయి.

ఇక భాషలో సూపర్ స్టార్ ఆటో డ్రైవర్ గా నటించారు. అలాగే మాఫియా డాన్ గాను కనిపిస్తారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రజినీకాంత్ కు జోడీగా నగ్మా నటించారు. ఈ సినిమా 1995లో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో నేను ఆటోవాణ్ని, ఆటోవాణ్ని  అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాటకు సూపర్ స్టార్ అదిరిపోయే స్టెప్పులేశారు.

రజినీకాంత్ స్టేజ్ పై డాన్స్ చేయడం అనేది చాలా రేర్. తాజాగా ఆయన స్టేజ్ పై డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రేర్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు డూపర్ స్టార్ ఫ్యాన్స్. ఈ వీడియోలో సూపర్ స్టార్ అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే ఇప్పుడు లోకేష్ కానగరాజ్ తో ఓ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్. కూలీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.