గతవారం పదిరోజులుగా ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న శుక్రవారం రాత్రి 8 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేశారు. ఈ వివాహ వేడుకకు దేశదేశాల నుంచి సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, గాయనీగాయకులు హాజరయ్యారు. అలాగే సౌత్, నార్త్ సినీ సెలబ్రెటీస్ కూడా పాల్గొన్నారు. వివాహానికి ముందు జరిగే వేడుకలలో పదిరోజులుగా బాలీవుడ్ తారలు సందడి చేశారు. మమేరు వేడుక నుంచి సంగీత్, హాల్దీ, మెహందీ వేడుకలలో బాలీవుడ్ సినీస్టార్స్ పాల్గొన్నారు. ఇక నిన్న జరిగిన వివాహ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రేటీస్ హాజరయ్యారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్, రాధిక పెళ్లికి హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ, నయనతార, విఘ్నేశ్ శివన్, సూర్య, జ్యోతిక, రానా దగ్గుబాటి తన భార్య మిహికాతో కలిసి అనంత్, రాధిక పెళ్లిలో సందడి చేశారు. ఇక అంబానీ ఇంట పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు సూపర్ స్టార్ రజినీకాంత్. ముఖ్యంగా వరుడు అనంత్ అంబానీతో కలిసి డాన్స్ చేశారు తలైవా. బాలీవుడ్ హీరోస్ అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ తో కలిసి అనంత్ అంబానీ, రజినీకాంత్ డాన్స్ చేశారు. 73 ఏళ్ల వయసులోనూ చిన్న చిన్న స్టెప్పులతో డాన్స్ అదరగొట్టేశారు రజినీకాంత్. తలైవా ఎనర్టిటిక్ స్టెప్పులు చూసి బాలీవుడ్ స్టార్ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. తలైవా డాన్స్, స్టైల్ చూసి మురిసిపోతున్నారు అభిమానులు. ఈ వయసులోనూ రజినీ డాన్స్ అదరగొట్టేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనంత్ అంబానీ పెళ్లికి ‘తలైవా’ రజనీకాంత్‌తో పాటు ఆయన భార్య లత, కూతురు సౌందర్య కూడా వెళ్లారు. అలాగే, బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, సంజయ్ దత్, జెనీలియా దేశ్‌ముఖ్, రితేష్ దేశ్‌ముఖ్, సిద్ధార్థ్, కియారా అద్వానీ, అలియా భట్, రణబీర్ కపూర్ అంబానీ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.
#Rajnikanth and #AnilKapoor dancing away with #AnantAmbani at the latter's wedding with #RadhikaMerchant today.#Trending pic.twitter.com/lkJNnFf4zf
— Filmfare (@filmfare) July 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.