మహేష్- త్రివిక్రమ్ సినిమా పై క్రేజీ అప్‍డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుంచే..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.

మహేష్- త్రివిక్రమ్ సినిమా పై క్రేజీ అప్‍డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుంచే..
Mahesh Trivikram

Updated on: Jun 01, 2021 | 4:52 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోండగా.. ఇప్పటివరకు శరవేగంగా జరుగుతున్న షూటింగ్‏కు కరోనా అడ్డుపడింది. దీంతో కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా సర్కారు వారి పాట చిత్రీకరణ తాత్కలికంగా నిలిచిపోయింది. అటు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. మహేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సర్కారు వారి పాట సినిమా పూర్తైన తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి మరో సినిమా చేయబోతున్నట్లుగా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే వీరిద్ధరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ సాధించగా.. వీరిద్దరి కలయికలో రాబోయే సినిమాపై ఇప్పటి నుంచి అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా షూటింగ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మొదలు కాబోతున్నట్లుగా టాక్ వినిపించింది. కానీ అది జరగలేదు. తాజాగా మరోసారి ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాను వచ్చే నెల జూలై నుంచి స్టార్ట్ చేయనున్నారట మేకర్స్. అప్పటి నుంచే రెగ్యూలర్ షూట్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. మహేష్ సినిమాలకు థమన్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. అలాగే రాబోయే సినిమాకు కూడా థమన్ సంగీతాన్ని అందించనున్నట్లుగా తెలుస్తోంది. Trivikram Srinivas

Also Read: టైప్ చేసే అక్షరాలకు ఎమోషన్స్ ఉండవు.. రాసే ప్రతి అక్షరానికి ఫీలింగ్ ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‏గా 18 Pages ఫస్ట్‏లుక్ పోస్టర్..

Karan Mehra: పాపులర్ టీవీ యాక్టర్ కరణ్ మెహ్రా అరెస్ట్.. తనను కొట్టాడంటూ భార్య ఫిర్యాదు.. ఆ వెంటనే..