టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినిమా ‘7G బృందావన్ కాలనీ’. 2004లో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పా్న్స్ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా యూత్‌కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించగా.. సోనియా అగర్వాల్ కథానాయికగా నటించింది. ఇలయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ చిత్రంలోని సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుండగా.. ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.
ఇక చాలా రోజులుగా ‘7G బృందావన్ కాలనీ’ సినిమా రీరిలీజ్ చేయాలని సినీ ప్రియులు ఎదురుచూస్తుండగా.. తాజాగా రీరిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 22న ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను సెప్టెంబర్ 16న రిలీజ్ చేస్తామని ఓ ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన ‘7G బృందావన్ కాలనీ’ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతుండడంతో యూత్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Telugu State’s again GET🎬READY.
for “#7Gbrindavancolony 🥰”#selvaraghavan#7grainbowcolony #RaghuvaranBtech pic.twitter.com/4hwtdc4IpA— the film mitrama (@thefilmmitrama) August 18, 2023
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ రూపొందిస్తామని అటు డైరెక్టర్ సెల్వరాఘవన్ చెప్పడంతో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలాగే ఇందులో మొదటి పార్ట్ లో మాదిరిగానే రవి కృష్ణ హీరోగా నటించనుండగా.. హీరోయిన్ ఎవరనేది ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా సీక్వెల్ పై మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.