బాలీవుడ్ హాట్ బ్యూటీగా సన్నీ లియోన్ అక్కడి కుర్ర హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది. చేసేది ఐటెమ్ సాంగ్స్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. సన్నీ స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అసలు విషయంలోకి వెళితే.. సన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్నాడట కమెడియన్ సునీల్ .
కాగా తాతినేని ప్రసాద్ అనే దర్శకుడు ఓ హర్రర్ కామెడి చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . కాగా అందులో సన్నీ లియోన్ తో పాటుగా సునీల్ అలాగే బ్రహ్మానందం కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . హర్రర్ కామెడీ చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉండటంతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు . ఇక ఈ మూవీకి సన్నీ లియోన్, సునీల్, బ్రహ్మనందంలు అగ్రిమెంట్ కూడా చేశారట . అంటే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో బైలింగ్వల్ మూవీగా రూపొందుతుండటం విశేషం.
త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసి షూటింగ్ మొదలుపెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. సన్నీ లియోన్ గతంలో చేసిన హార్రర్ సినిమాలకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. మరి ఇప్పుడు బ్రహ్మానందం – సునీల్ లతో కలిసి ఆమె ఏ విధంగా అలరిస్తారో చూడాలి.