Kapatadhaari Movie :
నటులు : అక్కినేని సుమంత్, నందితా శ్వాత, వెన్నెల కిషోర్ ,నాజర్, జయప్రకాష్
దర్శకుడు : ప్రదీప్ కృష్ణమూర్తి
నిర్మాత : ధనుంజయన్
అక్కినేని సుమంత్ హీరోగా మన ముందుకు వచ్చిన చిత్రం కపటధారి. కన్నడ సూపర్ హిట్ చిత్రం‘కావలధారి’కి రిమేక్ గా ఈ సినిమా తెరెకెక్కింది. ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తుండగా.. క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్స్ & బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రంలో ఓ ట్రాఫిక్ పోలీస్ తన పరిధిలోకి రాకున్న అన దృష్టికి వచ్చిన మర్డర్ మిస్టరీలను ఎలా సాల్వు చేశారన్న.. పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? పోలీస్ ఆఫీసర్‌గా సుమన్ ఎలా నటించాడు? ఏ కేసును ఛేదించాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
గౌతమ్ (సుమంత్ )ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలని కోరిక. కాని అందుకు పై అధికారులు ఒప్పుకోకపోవడంతో.. ఇష్టంలేకుండానే ట్రాఫిక్ విభాగంలో కొనసాగుతుంటాడు. ఇలా విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. మెట్రో పిల్లర్ తవ్వకాల్లో అనుకోకుండా అస్తిపంజరాలు బయటపడతాయి. అలా బయట పడ్డ అస్తిపంజరాలు నలభై యేళ్ల కిందట హత్య గురైన ఓ కుటుంబానివని తేలుతుంది. అయితే ఈ కేసును సాల్వ్ చేయలేక మూసివేసే ఆలోచనలో ఉంటాడు క్రైమ్ ఎస్సై.. కాని ట్రాఫిక్ పోలీసైన గౌతమ్ ఈ కేసును సాల్వ్ చేయాలని ట్రై చేస్తుంటాడు. అయితే ట్రాఫిక్ ఎస్సై గౌతమ్ ఆ హత్యల వెనక నిజాల్ని కనిపెడతాడా.? ఆ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇంతకీ నలభయ్యేళ్ల కిందట ఆ హత్యలను ఎవరు చేశారు ? అన్న కోణంలో ఈ సినిమా సాగుతుంటుంది.
విశ్లేషణ :
క్రైమ్ థ్రిల్లర్ కథలంటే దాదాపుగా ఓకే తరహాలో సాగుతుంటాయి. మర్డర్‌లు జరగడం.. ఆ మర్డర్‌కు సంబంధించిన ఓ చిన్న క్లూ పట్టుకుని కేసును చేధించండం.. అలా చేధించే క్రమంలో అనుకోని ట్విస్టులు ఎదరువ్వడం. వాటన్నింటిని తట్టుకొని హీరో కేసు సాల్వ్ చేయడం. ఇక ఈ సినిమా కూడా ఇదే దారిలో సాగుతూ.. థ్రిల్లర్ తరహా మూడ్‌ను స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో మాత్రం మర్డర్లు ఎప్పుడో నలభయ్యేళ్ల కిందట జరుగుతాయి.. దీంతో ఆ మర్డర్లకు సంబంధిచిన ఆధారాలే కాదు, మనుషులు.. పరిస్థితులు అన్నీ మారిపోయి . అలాంటి ఓ క్లిష్టమైన కేస్‌ని తన భుజాలపై వేసుకున్న హీరో. ఎలా ఆ కేసును చేధించిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ ఆఫ్‌లో హీరో సుమంత్ క్రైమ్ పోలీస్ అవడానికి పడిన స్ట్రగుల్.. మర్డర్‌కి సంబంధించి అస్తి పంజరాలను చూపించిన డైరెక్టర్.. సెకండ్ ఆఫ్‌లో ఆ మర్డర్‌ను సాల్వ్ చేసే విధానాన్ని చూపించాడు. డీసెంట్ ట్విస్ట్స్…మంచి కథనంతో.. సినిమా సాగుతూ.. ప్రేక్షకులకు మంచి థ్రిల్ ను ఇస్తుంది .
థ్రిల్లర్ సినిమాల్లో కథానాయకుడు సీరియస్‌గా ఒకే తరహా మూడ్‌లో కథలోని ఇంటెన్ససిటీని మరో లెవల్కు తీసుకెళుతుంటాడు. సుమంత్ కూడా.. ఇదే ఫీల్తో సినిమాలో నటించి అందర్ని మెస్మరైజ్ చేశాడు. ఇక సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన నాజర్, జయప్రకాష్ యాస్ యూస్‌వల్‌గా తమ సూపర్ నటనతో అందరినీ ఆక్టటుకున్నారు. వెన్నెల కిషోర్ ఫస్ట్ ఆప్లో కొన్ని చోట్ల నవ్వించారు. ఇలాంటి క్రైం థ్రిల్లర్ సినిమాల్లో హీరోయిన్‌కు ఎక్కవ ప్రాధాన్యం ఉండదు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ హీరోయిన్ నందితా శ్వాతకు అంత ప్రాధాన్యం లేదనిపిస్తుంది. సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి పనితనం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కథ కథనంలో బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కథను సాగదీసినట్టు అనిపిస్తుంది.
చివరిగా : ఆద్యంతం ఆసక్తిగా అలరించిన ‘కపటదారి’