Suman Setty: మా నాన్నే నెంబర్ వన్..! టాప్ 5 ఎవరో చెప్పిన సుమన్ శెట్టి పిల్లలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 11 వారం ఎండింగ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లేటెస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ ఆహ్లాదకరంగా సాగాయి. బిగ్ బాస్ డయాస్ పైకి కొందరు సెలెబ్రిటీలు, హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు.

Suman Setty: మా నాన్నే నెంబర్ వన్..! టాప్ 5 ఎవరో చెప్పిన సుమన్ శెట్టి పిల్లలు
Biggboss9

Updated on: Nov 24, 2025 | 11:27 AM

బిగ్ బాస్ సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ జరిగింది. తమ కుటుంబ సభ్యులను చూసి హౌస్ మేట్స్ ఎమోషనల్ అయ్యారు.అలాగే ఈవారం నో ఎలిమినేషన్ ఉండటంతో హౌస్ మేట్స్ అంతా ఆనందంలో తేలిపోయారు. వారి ఆనందాన్ని డబుల్ చేస్తూ స్టేజ్ పైకి హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులను తీసుకు వచ్చారు నాగార్జున. తమ ఫ్యామిలీ మెంబర్స్ ను, ఫ్రెండ్స్ ను స్టేజ్ పైకి తీసుకొచ్చారు నాగార్జున. తమ ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి ఎమోషనల్ అయ్యారు హౌస్ మేట్స్. అలాగే బిగ్ బాస్ స్టేజ్ పైకి సుమన్ శెట్టి పిల్లలు కూడా వచ్చారు. ఫ్యామిలీ వీక్ లో సుమన్ శెట్టి భార్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు పిల్లల గురించి అడిగి ఎమోషనల్ అయ్యాడు సుమన్ శెట్టి.

ఇక ఇప్పుడు సుమన్ శెట్టి పిల్లలు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. సుమన్ శెట్టి తరఫున ఆయన పిల్లలు గౌతమ్, రూపిక స్టేజ్ మీదకి వచ్చారు. అలానే సెలబ్రెటీ ఫ్రెండ్‌గా కమెడియన్ శ్రీనివాస రెడ్డి వచ్చారు. పిల్లల్ని చూడగానే సుమన్ శెట్టి కళ్లల్లో ఆనందం మాములుగా లేదు. కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుంటూ పిల్లతో ప్రేమగా మాట్లాడాడు సుమన్ శెట్టి. తర్వాత ఇద్దరు పిల్లలు కలిసి.. తమ దృష్టి టాప్-5 ఎవరో స్థానాల వారీగా చెప్పారు.

ఇక తమ నాన్నే నెంబర్ వన్ అని చెప్పారు సుమన్ శెట్టి పిల్లలు.. సుమన్ కి నెంబర్ వన్ స్థానమిచ్చారు. 2.ఇమ్మానుయేల్, 3. తనూజ, 4. భరణి, 5.కళ్యాణ్ అని చెప్పారు పిల్లలు. అలాగే సుమన్ శెట్టి స్నేహితుడు నటుడు శ్రీనివాస్ రెడ్డి కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నవ్వులు పూయించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.