Sriranga Neethulu Movie: ఓటీటీ కాదు.. నేరుగా యూట్యూబ్‏లో రిలీజ్ అవుతున్న సుహాస్ సినిమా.. ఎప్పటినుంచంటే..

|

May 29, 2024 | 6:38 AM

రైటర్ పద్మభూషణ్, ప్రసన్న వదనం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. ఇక సుహాస్ హీరోగా నటించిన మరో హిట్ మూవీ శ్రీరంగనీతులు. ఈఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ కాకుండా నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.

Sriranga Neethulu Movie: ఓటీటీ కాదు.. నేరుగా యూట్యూబ్‏లో రిలీజ్ అవుతున్న సుహాస్ సినిమా.. ఎప్పటినుంచంటే..
Sriranganeethulu
Follow us on

ఈ వారం థియేటర్లలో భజే వాయువేగం, గం గం గణేశా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఓటీటీలో పలు హిట్ మూవీస్… వెబ్ సిరీస్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. కానీ ఇప్పుడు ఓ హిట్ మూవీ ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‏లోకి రాబోతుంది. అదే యంగ్ హీరో సుహాస్ నటించిన శ్రీరంగనీతులు. కొన్నాళ్లుగా సుహాస్ వరుసగా హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్, ప్రసన్న వదనం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. ఇక సుహాస్ హీరోగా నటించిన మరో హిట్ మూవీ శ్రీరంగనీతులు. ఈఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ కాకుండా నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.

శ్రీరంగనీతులు సినిమాను మే 30వ తేదీన యూట్యూబ్‏లో శ్రీభవానీ హెచ్డీ మూవీస్ ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మే 30న శ్రీరంగనీతులు ప్రీమియర్ అవుతుందని.. యూట్యూబ్ లో ఉచితంగా చూడొచ్చని తెలిపారు. ఈ చిత్రంలో సుహాస్, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ, కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించగా..తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, అజయ్ అరసాద సంగీతం అందించగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేశ్వరరావు బల్మూరీ నిర్మించారు.

వరుసగా హిట్స్ అందుకుంటున్న సుహాస్ కెరీర్‏లో ఈ చిత్రం నిరాశను మిగిల్చింది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజులకు పైగా పూర్తైన ఇప్పటివరకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ లో ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరోవైపు సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమాతో థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ చిత్రం అటు ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.