పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. త్వరలోనే అనౌన్స్ చేస్తా అంటూ హింట్.. అమ్మాయి ఎవరంటే

టీవీ షోల ద్వారా పాపులర్ అయినా వారు చాలా మంది మంది ఉన్నారు. బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు హీరోగా, యాంకర్ గా రాణిస్తున్నాడు.

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. త్వరలోనే అనౌన్స్ చేస్తా అంటూ హింట్.. అమ్మాయి ఎవరంటే
Sudigali Sudheer

Updated on: May 21, 2026 | 7:33 AM

ప్రస్తుతం బుల్లితెరపై చాలా మంది యాంకర్ గా రాణిస్తున్నారు. అలాగే యాంకర్ గా చేస్తూనే హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ప్రదీప్ మాచిరాజు కూడా హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే యాంకర్ గా చేసి ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్ పాపులర్ అయ్యాడు. ఈ కామెడీ షోలో  స్కిట్స్ తో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాడు. కెరీర్ బిగినింగ్ లో కమెడియన్ వేణు టీమ్‌లో చిన్న చిన్న రోల్స్ చేసిన సుధీర్ ఆతర్వాత మెయిన్‌గా మారాడు. ఆతర్వాత టీమ్ లీడర్‌గా మారాడు. తన స్కిట్స్ తోనే కాదు యాంకర్‌గాను ప్రేక్షకులను అలరించాడు సుడిగాలి సుధీర్. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన సుధీర్. ఆతర్వాత హీరోగా సినిమాలు చేశాడు.  వరుసగా సినిమాలు చేస్తున్న సుధీర్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. త్వరలోనే గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

ఇదిలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించిన న్యూస్ వైరల్ అవుతుంది. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. జబర్దస్త్ షోలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ టీవీ షోల్లోనూ వీరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడం, లవ్ సాంగ్స్ వేయడంతో అందరూ నిజగానే ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు.. ప్రస్తుతం ఈ ఇద్దరూ వారి వారి షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

ఇటీవలే సుధీర్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. అలాగే కొన్ని కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు. తాజాగా జోకర్ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లాంచ్ లో ఓ అభిమాని సుధీర్ ను అన్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అడిగాడు. దానికి సుధీర్ స్పందిస్తూ..  ప్రస్తుతానికి పెళ్లి తెలియదు. కానీ జరిగితే మాత్రం త్వరలో నేనే అధికారికంగా అనౌన్స్ చేస్తానని సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే సుధీర్ ఎవరిని పెళ్లి చేసుకున్నటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొంతమంది రష్మినే పెళ్లి చేసుకుంటాడని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us