Sudheer Babu: కృతి శెట్టి గురించి మీకు ఏదో చెప్పాలి అంటోన్న సుధీర్ బాబు.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో..

|

Mar 01, 2021 | 9:13 PM

Sudheer Babu New Movie Title Announce: సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సుధీర్ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై..

Sudheer Babu: కృతి శెట్టి గురించి మీకు ఏదో చెప్పాలి అంటోన్న సుధీర్ బాబు.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో..
Follow us on

Sudheer Babu New Movie Title Announce: సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సుధీర్ 14వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచానాలే ఉన్నాయి. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ బాబు తన 14వ చిత్రానికి సంబంధించి ప్రకటన చేస్తూ ఓ వీడియోను విడుదల చేస్తూ.. మార్చి 1న సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుధీర్ బాబు తాజాగా సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తూ ఓ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఇందులో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘మార్చి 1 వచ్చేసింది కదా.. మీ అద్భుత స్పందనకు ధన్యవాదాలు. మీలో చాలా మంది కరెక్ట్‌గా చెప్పారు. నేను ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ గారితో చేస్తోన్న మూడో సినిమా.. టైటిల్ ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’’ అంటూ విడుదల చేశాడు.
ఈ సినిమా చిత్రీకరణ సోమవారం ప్రారంభమైంది. మరి సుధీర్ బాబు ఉప్పెన భామ కృతి శెట్టి గురించి ఏం చెప్తాడో తెలియాలంటే చిత్ర విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాను బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Actress Jayasudha: సహజనటి ఏంటి ఇలా అయిపోయింది.. షాక్‌కు గురవుతున్న అభిమానులు, నెటిజన్లు

Wild Dog Movie: హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లే ‘వైల్డ్ డాగ్’కు మూలం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాగ్..

Nidhhi Agerwal: ఐ యామ్ సింగిల్.. మెసేజ్ చేసేందుకు, కాల్ మాట్లాడేందుకు ఎవరూ లేరు: నిధి అగర్వాల్