Wild Dog Movie: హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్లే ‘వైల్డ్ డాగ్’కు మూలం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నాగ్..
Nagarjuna Wild Dog Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా అహిషఓర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగ్ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై...
Nagarjuna Wild Dog Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా అహిషఓర్ సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగ్ ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్ కర్ణి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టిన చిత్ర యూనిట్ సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర వివరాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆ బాంబులను పెట్టిన ఉగ్రవాదులను పట్టుకోవడమే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఈ మిషన్‌కి నేను కమాండర్‌గా ఉంటాను. ఈ సినిమా కోసం దర్శకుడు ఏది చెబితే అది చేశాను. నిజానికి తొలుత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనుకున్నాం. కరోనా కారణంగా సినిమాకు ప్రేక్షకులు రారని భయపడ్డాం. కానీ ‘క్రాక్’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలు విజయవంతంకావడంతో మాకు ధైర్యం వచ్చింది. ఈ కారణంగానే సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాం’ అని చెప్పుకొచ్చాడు నాగ్.
‘వైల్డ్ డాగ్’ పేరు ఎందుకు పెట్టారంటే..
ఇక ఈ సినిమాకు ఇదే టైటిల్ ఎందుకు పెట్టారన్న విషయంపై నాగ్ మాట్లాడుతూ.. అడవిలో వైల్డ్ డాగ్స్ సింహాలను కూడా వేటాడతాయి. దాన్ని చంపేంత వరకు అవి విశ్రమించవు. అనుకున్నది సాధించే వరకూ వెనుదిరగవు. అందుకే ఈ సినిమాకు ‘వైల్డ్ డాగ్’ అని పేరు పెట్టారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 10న విడుదల చేయనున్నట్లు నాగ్ తెలిపాడు. తన తర్వాతి చిత్రం ‘బంగార్రాజు’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాడు.
Also Read: Nidhhi Agerwal: ఐ యామ్ సింగిల్.. మెసేజ్ చేసేందుకు, కాల్ మాట్లాడేందుకు ఎవరూ లేరు: నిధి అగర్వాల్