వేగం పెంచిన లెక్కల మాస్టారూ.. ఈసారి అన్నయ్యకు ఛాన్స్ ఇచ్చే పనిలో సుకుమార్.. దర్శకుడిగా మరో శిష్యుడు..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న 'పుష్ప' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ

వేగం పెంచిన లెక్కల మాస్టారూ.. ఈసారి అన్నయ్యకు ఛాన్స్ ఇచ్చే పనిలో సుకుమార్.. దర్శకుడిగా మరో శిష్యుడు..
Sukumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 01, 2021 | 10:22 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈయన బిజీ అయిపోతున్నాడు. తన అసిస్టెంట్స్‌ను దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు శిష్యులను దర్శకులుగా పరిచయం చేసి విజయం అందుకున్నాడు సుకుమార్. తాజాగా ఈయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా సాధించిన విజయం గురించి తెలిసిందే. తాజాగా మారో శిష్యుడిని దర్శకుడిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటివరకు సక్సె్స్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న సుకుమార్ ఇటీవలే నిర్మాతగా మారాడు. ఇక ఆయన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరిని దర్శకులుగా వెండితెరకు పరిచయం చేస్తున్నారు. దర్శకుడిగా సుకుమార్ తన సినిమాకి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అందువలన ఒక సినిమాకి .. మరో సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ వచ్చేస్తోంది. ఆ గ్యాప్ ను ఒక నిర్మాతగా పూడ్చడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించింది. సేఫ్ ప్రాజెక్టు అనిపించుకోవడం కోసం ఆయన పెద్ద బ్యానర్లతో కలిసి ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి సుకుమార్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నాడట. ఈయన నిర్మాతగా.. కథలో మార్గదర్శకాలు ఇస్తూ సాయితో సినిమా నిర్మించబోతున్నాడు. అందులోనూ భాగస్వామి కానున్నాడు సుకుమార్. దాదాపు 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది ఉప్పెన. ఈ సినిమాకు సుకుమార్ చేసిందేం లేదు. కేవలం సమర్పకుడిగా ఉండి.. బుచ్చిబాబుకు కావాల్సిన ప్రమోషన్ ఇచ్చాడంతే. కథా చర్చల్లో అప్పుడప్పుడూ పాల్గొని సరైన మార్గంలో ఉప్పెనను మళ్లించాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించాడు సుకుమార్. ఈ సినిమాకు సహాయ సహకారాలు అందించినందుకు 10 కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు తమ్ముడి సినిమాపై వచ్చిన డబ్బును అన్నయ్యపై పెట్టబోతున్నాడు సుకుమార్.

Also Read:

Sudheer Babu: కృతి శెట్టి గురించి మీకు ఏదో చెప్పాలి అంటోన్న సుధీర్ బాబు.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న వీడియో..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.