చార్లీ చాప్లిన్ పాత్రలో టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా? చిరంజీవికి వీరాభిమాని

గతంలో ఎంతో మంది నటులు చార్లీ చాప్లిన్ పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం చంటబ్బాయి సినిమాలో కొద్ది సేపు చార్లీ చాప్లిన్ గా కనిపించి ఆడియెన్స్ ను నవ్వించారు. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో చార్లీ చాప్లిన్ పాత్రలో కనిపించనున్నారు.

చార్లీ చాప్లిన్ పాత్రలో టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా? చిరంజీవికి వీరాభిమాని
Directed By Charlie Chaplin Movie

Updated on: Nov 13, 2026 | 8:06 PM

చార్లీ చాప్లిన్ జీవిత కథ ఆధారంగా ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అలాగే ఎంతో మంది దిగ్గజ నటులు ఆయన లాగా నటించి మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం చంటబ్బాయి సినిమాలో కొద్ది సేపు చార్లీ చాప్లిన్ గా కనిపించి ఆడియెన్స్ ను నవ్వించారు. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో చార్లీ చాప్లిన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘SI యుగంధర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్ర కటారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరో చార్లీ చాప్లిన్ పాత్ర పోషించనున్నాడు.ఇందుకోసం చాప్లిన్ హావభావాలు, బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకమైన మ్యానరిజమ్స్‌పై ఆయన ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ క్రమంలోనే ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో చార్లీ చాప్లిన్ పాత్రలో టాలీవుడ్ యంగ్ హీరో ఒదిగిపోయాడు. ప్రస్తుతం ఈ కొత్త సినిమా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు శేఖర్ కమ్ముల తెరెక్కించిన ‘ది లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాల హీరోగా నటించిన సుధాకర్ కోమాకుల. ఈ ఫీల్ గుడ్ మూవీలో తెలంగాణ కుర్రాడిగా నాగరాజు పాత్రలో ఆకట్టుకున్నాడు సుధాకర్.

కాగా మనసుతో, ఒక విచిత్రం, హ్యాంగ్అప్, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, కుందనపు బొమ్మ, నువ్వు తోపురా తదితర సినిమాల్లో హీరోగా నటించాడు సుధాకర్. అయితే పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. దీంతో క్రాక్, రాజా విక్రమార్క సినిమల్లో సహాయక నటుడిగా కూడా చేశాడు. అలాగే 2023లో వచ్చిన నారాయణ అండ్ కో సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. అయితే ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుధాకర్ ఇప్పుడు ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ అనే ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ‘Life Is a Dramedy’ (జీవితమే ఒక డ్రామెడీ) అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్, సుఖ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మనర్తి విఘ్నేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్‌కు తొలి నిర్మాణం. బన్సారీ ఫిల్మ్స్ సౌజన్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇవి కూడా చదవండి

చార్లీ చాప్లిన్ గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో..

మెగాస్టార్ చిరంజీవితో సుధాకర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
.

Loading...
Unable to load recommendations.
Follow Us