AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అనిమే సందడి.. బ్లీచ్ డైరెక్టర్ చేతుల మీదుగా భారతీయ క్రియేటర్లకు అరుదైన అవకాశం

జపనీస్ అనిమే ప్రపంచానికి భారత్‌లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘బ్లీచ్’, ‘నరుటో’, ‘యు యు హకుషో’ వంటి సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ జపనీస్ అనిమే సిరీస్ ‘బ్లీచ్’ డైరెక్టర్ నోరియుకి అబే హైదరాబాద్‌కు రాబోతున్నారు. అంతేకాదు.. భారతీయ క్రియేటర్లు రూపొందించిన ఒరిజినల్ అనిమే కథలను స్వయంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేయనున్నారు.

హైదరాబాద్‌లో అనిమే సందడి.. బ్లీచ్ డైరెక్టర్ చేతుల మీదుగా భారతీయ క్రియేటర్లకు అరుదైన అవకాశం
Anime India
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2026 | 6:53 PM

Share

జపనీస్ అనిమే ప్రపంచానికి భారత్‌లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ‘బ్లీచ్’, ‘నరుటో’, ‘యు యు హకుషో’ వంటి సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ జపనీస్ అనిమే సిరీస్ ‘బ్లీచ్’ డైరెక్టర్ నోరియుకి అబే హైదరాబాద్‌కు రాబోతున్నారు. అంతేకాదు.. భారతీయ క్రియేటర్లు రూపొందించిన ఒరిజినల్ అనిమే కథలను స్వయంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేయనున్నారు. నవంబర్ 14న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న అనిమే ఇండియా వేడుకల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనిమే దర్శకుడు నోరియుకి అబే హైదరాబాద్‌కు రానుండటం అనిమే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ‘బ్లీచ్’తో పాటు ‘యు యు హకుషో’, ‘గ్రేట్ టీచర్ ఒనిజుకా’ వంటి ప్రముఖ అనిమే ప్రాజెక్టులకు ఆయన దర్శకత్వం వహించారు. ‘బోరుటో’ సిరీస్‌కు చీఫ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. భారత్‌లోని యువ కళాకారులు, విద్యార్థులు, యానిమేషన్ స్టూడియోలు, స్వతంత్ర క్రియేటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు అనిమే టైమ్స్, అనిమే ఇండియా సంయుక్తంగా ప్రత్యేక పోటీ నిర్వహించాయి. భారతీయ, జపనీస్ సంస్కృతుల సమ్మేళనంతో సరికొత్త అనిమే కథలను రూపొందించాలన్నది ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.

ఈ పోటీకి అనూహ్య స్పందన లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్ల నుంచి ఏకంగా 1,500కు పైగా ఎంట్రీలు వచ్చాయి. వ్యక్తిగతంగా పాల్గొన్న కళాకారులతో పాటు విద్యార్థుల బృందాలు, యానిమేషన్ స్టూడియోలు కూడా తమ సృజనాత్మక ఆలోచనలను సమర్పించాయి. ఈ పోటీలో వచ్చిన ఎంట్రీలను నోరియుకి అబేతో పాటు ప్రముఖుల బృందం పరిశీలించనుంది. ఈ జ్యూరీలో ది అనిమే టైమ్స్ కంపెనీ ప్రెసిడెంట్ హిడియో కట్సుమటా, అవెక్స్ పిక్చర్స్ ప్రొడ్యూసర్ తోమోహికో ఇవాసే, ఇండియన్ టెలివిజన్ డాట్ కామ్ గ్రూప్ ఫౌండర్ అండ్ సీఈఓ అనిల్ వన్వారి ఉన్నారు. ఈ అనిమే పోటీని రెండు కేటగిరీలుగా నిర్వహించారు. వీడియో కేటగిరీలో ఐదు నిమిషాల నిడివి కలిగిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌తో పాటు ప్రపోజల్ సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రపోజల్ కేటగిరీలో కథా, విజువల్స్‌తో కలిపి 15 పేజీల స్టోరీ పిచ్‌ను అందించాలి.

వీడియో కేటగిరీలో విజేతగా నిలిచిన వారికి 10 లక్షల జపనీస్ యెన్ ప్రైజ్ మనీగా అందించనున్నారు. ప్రపోజల్ కేటగిరీలో విజేతకు 3 లక్షల జపనీస్ యెన్ బహుమతిగా లభిస్తుంది. దీంతో పాటు ఎంపికైన కొన్ని కథా ఆలోచనలను భవిష్యత్తులో అనిమే ప్రొడక్షన్ కోసం పరిశీలించే అవకాశం ఉంది. అయితే వాటికి ప్రొడక్షన్ ఒప్పందం లేదా కమర్షియల్ రిలీజ్ ఖాయమని నిర్వాహకులు హామీ ఇవ్వలేదు. ఈ పోటీని తొలుత అనిమే ఇండియా ఢిల్లీ ఎడిషన్‌లో ప్రకటించారు. జూన్‌లో ఎంట్రీలను స్వీకరించడం ప్రారంభించి జూలై 31తో గడువు ముగించారు. ఆగస్టులో ముంబై ఎడిషన్ సందర్భంగా ఫలితాలను వెల్లడించారు. ఇప్పుడు నవంబర్ 14న హైదరాబాద్ వేదికగా తుది విజేతలను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లో నవంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు అనిమే ఇండియా వేడుకలు జరగనున్నాయి. నార్సింగిలోని ది అడ్రస్ కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనిమే స్క్రీనింగ్స్, లైవ్ మ్యూజిక్, జపనీస్ పాప్ కల్చర్, గేమింగ్, కాస్ప్లే పోటీలు, ఆర్టిస్ట్స్ అలీ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉండనున్నాయి. ఈ వేడుకల్లో జపనీస్ పాప్ ఆర్టిస్టులు మేనా, మే రే ప్రత్యేకంగా సందడి చేయనున్నారు. అలాగే కాస్ప్లే పోటీలు, జపనీస్ గేమింగ్ అరేనా, ఫ్యాన్ యాక్టివిటీస్, బాహుబలి ప్రత్యేక కార్యక్రమాలు, అనిమే డీజే పార్టీ వంటి ఈవెంట్స్ అభిమానులను ఆకట్టుకోనున్నాయి. ఇప్పటివరకు జపనీస్ అనిమేలను చూసి అభిమానించిన భారతీయ యువత.. ఇప్పుడు తమ సొంత కథలను అదే స్థాయి అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసే అవకాశాన్ని పొందుతున్నారు. 1,500కు పైగా ఎంట్రీల్లో విజేతలుగా నిలిచే క్రియేటర్లకు ఇది గొప్ప గుర్తింపుగా మారనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో