‘బాహుబలి’ ఫైట్ మాస్టర్..డైరెక్టర్‌గా ఎంట్రీ!

సినిమా పరిశ్రమలోని ఎప్పుడూ ఒకేలా ఉండరు. ప్రతి శుక్రవారం ఇక్కడ జీవితాలు తారుమారవుతూ ఉంటాయి. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. అయితే కాస్త క్లిక్ అయిన తర్వాత వారిలోని విభిన్న టాలెంట్స్‌ను చూపించాలని చాలామంది అనుకుంటారు. అలా ఆచరణలో పెట్టి సక్సెస్ అయినవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి ఫైట్ మాస్టర్ గా పనిచేసిన పీటర్ హెయిన్స్, అతి త్వరలో దర్శకుడిగా సరికొత్త […]

బాహుబలి ఫైట్ మాస్టర్..డైరెక్టర్‌గా ఎంట్రీ!
Stunt choreographer Peter Hein to turn director

Updated on: Sep 03, 2019 | 4:49 PM

సినిమా పరిశ్రమలోని ఎప్పుడూ ఒకేలా ఉండరు. ప్రతి శుక్రవారం ఇక్కడ జీవితాలు తారుమారవుతూ ఉంటాయి. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. అయితే కాస్త క్లిక్ అయిన తర్వాత వారిలోని విభిన్న టాలెంట్స్‌ను చూపించాలని చాలామంది అనుకుంటారు. అలా ఆచరణలో పెట్టి సక్సెస్ అయినవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ కి ఫైట్ మాస్టర్ గా పనిచేసిన పీటర్ హెయిన్స్, అతి త్వరలో దర్శకుడిగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు.

టాలీవుడ్ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా  పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు,  సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. నిజానికి ఈ విషయమై కొద్దిరోజుల నుండి సర్కులేట్ అవుతున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా న్యూస్ బయటకు రాలేదు.  మరి ఫైట్ మాస్టర్‌గా అదరగొట్టిన పీటర్ హెయిన్స్  దర్శకుడిగా ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి!