AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalini: ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అజిత్ భార్య.. కారణం ఏంటంటే..

అజిత్ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అజిత్ చివరిగా తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమా పర్లేదు అనుపించుకుంది. ఇక ఇప్పుడు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అజిత్ హైదరాబాద్ రోడ్ల పై తన బైక్ తో చక్కర్లు కొడుతూ కనిపించాడు.

Shalini: ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అజిత్ భార్య.. కారణం ఏంటంటే..
Ajith
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2024 | 9:58 AM

Share

తమిళ్ స్టార్ హీరో అజిత్  సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అజిత్ సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అజిత్ చివరిగా తునివు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమా పర్లేదు అనుపించుకుంది. ఇక ఇప్పుడు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అజిత్ హైదరాబాద్ రోడ్ల పై తన బైక్ తో చక్కర్లు కొడుతూ కనిపించాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు అజిత్. ఇదిలా ఉంటే తాజాగా అజిత్ భార్య నటి షాలిని ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే..

అజిత్ సతీమణి షాలిని గురించి అందరికి తెలిసిందే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన షాలిని ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేశారు. అజిత్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. షాలిని పేరుమీద కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. ఫేక్ అకౌంట్ ను క్రియేట్ చేసి మోసం చేస్తూ.. వేలాది మంది ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. దీని పై షాలిని స్పందించింది.

దీని పై స్పందిస్తూ షాలిని ఓ సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేశారు. తన ఇన్ స్టా గ్రామ్ పేజిలో ఫేక్ ఎక్స్( ట్విట్టర్) స్క్రీన్ షాట్ పోస్ట్ చేసి ఇది నా అఫిషియల్ ఎక్స్( ట్విట్టర్ ) ఖాతా కాదని, దయచేసి ఈ ఖాతాను ఎవరు ఫాలో చేయవద్దని ఫ్యాన్స్ ను కోరింది షాలిని. షాలిని పేరుమీద ఓ ఫేక్ ఎక్స్ (ట్విట్టర్ ) ఖాతాను క్రియేట్ చేసి రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తున్నాడు ఓ మోసగాడు.  ఈ క్రమంలోనే.. ఇప్పటి వరకు దాదాపు 80.1K మంది ఫాలోవర్లను పెంచుకున్నాడు.

షాలిని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ