Atlee: ఇదేందయ్యా ఇది..! ఒక్క టీ షర్ట్ ధర అన్ని లక్షలా..!! అట్లీ మామూలోడు కాదుగా..

|

Dec 25, 2024 | 12:17 PM

దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో వచ్చిన తేరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2016 చిత్రం తేరి విడుదలైంది. ఈ చిత్రంలో నటుడు విజయ్ పోలీస్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం తమిళంలో విజయం సాధించడంతో హిందీలో రీమేక్ అయిన బేబీ జాన్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.

Atlee: ఇదేందయ్యా ఇది..! ఒక్క టీ షర్ట్ ధర అన్ని లక్షలా..!! అట్లీ మామూలోడు కాదుగా..
Atlee
Follow us on

2013లో విడుదలైన రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్ అట్లీ. స్టార్ హీరో దళపతి విజయ్‌తో థెరి, మెర్సల్, బిగిల్ అనే మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత బాగా పాపులర్ అయ్యాడు. ఈ చిత్రాలతో తెలుగు, హిందీలోనూ పాపులర్ అయ్యాడు. అతను బాలీవుడ్‌లో జవాన్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఏకంగా ఈ సినిమా బాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా రూ.1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటించింది. తన 5వ సినిమాతో పాన్-ఇండియా హిట్‌ కొట్టి స్టార్ డైరెక్టర్ గా మారిన అట్లీ ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటనున్నాడు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. ఆ హీరోయిన్ ఈమేనా.. చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గాబితో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు డిసెంబర్ 25న విడుదలకానుంది. ఈ సందర్భంలో, దర్శకుడు అట్లీ టీ-షర్ట్ ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. థెరి చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటించింది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. విజయ్, సమంత, అమీ జాక్సన్, నైనికా, రాధిక శరత్‌కుమార్, రాజేంద్రన్, ప్రకాష్ కుమార్, ప్రభు కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విజయం తర్వాత, దర్శకుడు అట్లీ తేరి రీమేక్ గా బేబీ జాన్ ప్రస్తుతం ఖలీస్ దర్శకత్వంవహిస్తున్నారు.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్

తాజాగా బేబీ జాన్ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న అట్లీ ధరించిన టీ షర్ట్ అందరిని ఆకర్షించింది.దాని ధర ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. బేబీ జాన్ ప్రమోషన్‌లో అట్లీ ధరించిన టీ షర్ట్ ఎంతో తెలుసా.? ఆ ఒక్క టీ షర్ట్ ఖరీదు రూ. 1,12,00. ప్రస్తుతం ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినిమా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు ప్రముఖ దర్శకుడు, సినిమా నిర్మాతగా మారిన తమిళంలో ప్రముఖ దర్శకుల్లో అట్లీ ఒకరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి