
యువ సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా టాప్ హీరోస్ సినిమాలు చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. ఇటీవలే పవర్ స్టార్ ‘వకీల్‌సాబ్’ సినిమాను కూడా చేపట్టి తన సత్తా ఏంటో పవన్ అభిమానులకు చూపించబోతున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ నుంచి ట్విట్టర్ వేదికగా ఊహించని సర్‌ప్రైజ్ అందుకున్నాడు తమన్. పవన్ అభిమానిగా తనకు ఈ సర్‌ప్రైజ్ ఎంతో సంతోషం తీసుకొచ్చిందని చెప్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడీ సంగీత దర్శకుడు. ఇంతకీ కళ్యాణ్ బాబు నుంచి తమన్‌కు అందిన ఆ సర్‌ప్రైజ్ ఏంటనే కదా మీ డౌబ్ట్.. అక్కడికే వస్తున్నాం.
రీసెంట్ గా పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో తమన్‌ను ఫాలో చేయడం ప్రారంభించాడు. తన ట్విట్టర్ నోటిఫికేషన్‌లో పవన్ తనని ఫాలో అవుతున్నట్లు గమనించిన తమన్.. ఆ ఆనందాన్ని అదే ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. పవన్ తనని ఫాలో అవుతున్నట్లుగా వచ్చిన నోటిఫికేషన్‌ను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశాడు. ఓ ఫ్యాన్ కి అత్యంత సంతోషకరమైన క్షణాలివి. ఈరోజు ఇంత అద్భుతంగా స్టార్ట్ అవుతుందని అస్సలు ఊహించలేదు సర్. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. లవ్ యు సర్” అంటూ ఆ ఫొటోకి కామెంట్స్ జత చేశాడు తమన్.
One of the biggest happiesttttttttttt fannnnnnnnnnnnnnnnnnnnnn
moment
Can’t get a bigger way to start the day .
Sirrrrrrrrrrrr ♥️Lots of gratitude & respect sir
Love U sir
God bless ✊ pic.twitter.com/fX5CTClbLi— thaman S (@MusicThaman) April 4, 2020